ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Mahua Moitra : పప్పు ఎవరో గణాంకాలే చెప్తున్నాయ్‌!

ABN, First Publish Date - 2022-12-14T00:59:46+05:30

భారతదేశ వృద్ధిరేటు క్షీణిస్తుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం వృద్ధి రేటు దూసుకుపోతోందంటూ తప్పుడు లెక్కలతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 13: భారతదేశ వృద్ధిరేటు క్షీణిస్తుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం వృద్ధి రేటు దూసుకుపోతోందంటూ తప్పుడు లెక్కలతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ధ్వజమెత్తారు. ఎన్‌ఎ్‌సవో(జాతీయ గణాంకాల కార్యాలయం) గణాంకాలను మంగళవారం ఆమె లోక్‌సభ ముందుంచారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి ఈ ఏడాది అక్టోబరు నాటికి 4శాతం తగ్గి, 26 నెలల కనిష్ఠానికి పడిపోయిందని మహువా చెప్పారు. తయారీ రంగం 5.6 శాతం క్షీణించిందని తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ(ఐఐపీ)ని ప్రభావితం చేసే 17 పారిశ్రామిక రంగాల వృద్ధిరేటు క్షీణించిందని, ఫారెక్స్‌ నిల్వలు ఏడాదిలో 72 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయాయని వివరించారు. ఎదుటి వ్యక్తులను కించపరచడానికి పప్పు అనే పదాన్ని బీజేపీ ఉపయోగిస్తోందని, అసలైన పప్పు ఎవరో ఈ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-12-14T00:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising