ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Who's Pappu now: ఇప్పుడు చెప్పండి ‘పప్పు’ ఎవరు? కేంద్రాన్ని ఉతికి ఆరేసిన తృణమూల్ ఎంపీ!

ABN, First Publish Date - 2022-12-13T20:34:40+05:30

‘ఇప్పుడు చెప్పండి ‘పప్పు’ ఎవరు?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)

Mahua Moitra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘ఇప్పుడు చెప్పండి ‘పప్పు’ ఎవరు?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తూర్పారబట్టిన ఎంపీ అందుకోసం పారిశ్రామిక ఒడిదొడులకు సంబంధించిన గణాంకాలను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం, అధికార పార్టీ ‘పప్పు’ అనే పదాన్ని సృష్టించాయని అన్నారు. వారు ఆ పదాన్ని కించపరిచేందుకు, తీవ్ర అసమర్థత గురించి చెప్పేందుకు ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, ఇప్పుడు ‘అసలు పప్పు’ ఎవరో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయని మహువా అన్నారు. దేశ వృద్ధిపై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడిన ఆమె.. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ సాధించాలని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు సూచించారు.

దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబరులో నాలుగు శాతానికి తగ్గి 26 నెలల కనిష్ఠానికి పడిపోయిందని, ఉత్పాదక రంగమే ఇప్పటికే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తోందని అన్నారు. అలాంటిది ఈసారి అది 5.6 శాతానికి తగ్గిందంటూ జాతీయ గణాంక కార్యాలయం (NSO) విడుదల చేసిన డేటాను ప్రస్తావిస్తూ మొయిత్రా కేంద్రంపై దుమ్మెత్తి పోశారు.

సొంత రాష్ట్రాన్నే నిలుపుకోలేకపోయారు

టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమిపైనా తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు సొంత రాష్ట్రాన్నే నిలుపుకోలేకపోయారని, ఇప్పుడు ‘పప్పు’ ఎవరని ప్రశ్నించారు. ఈ ఏడాది తొలి 10 నెలల్లో దాదాపు 2 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదలుకున్నారని గత శుక్రవారం ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం సభకు తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2014 నుంచి గడిచిన 9 సంవత్సరాలలో ఈ ప్రభుత్వ హయాంలో ఏకంగా 12.5 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని ఎంపీ పేర్కొన్నారు. మరి ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వాతావరణానికి సంకేతమా? అంటూ.. ‘ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. వ్యాపారవేత్తలు, సంపన్నులు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ కత్తిని వేలాడదీస్తుండడంతో దేశంలో ‘ఉగ్రవాద వాతావరణం’ నెలకొని ఉందని అన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహువా ఆరోపించారు. నోట్ల రద్దు విఫలమైందని, లక్ష్యాన్ని చేరుకోవాలన్న కలను నకిలీ నోట్లు ఇప్పటికీ దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-13T20:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising