ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uddhav Thackeray: వాటిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించండి

ABN, First Publish Date - 2022-12-26T17:10:12+05:30

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం (Maharashtra-Karnataka border row) రగులుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. సోమవారంనాడు మహారాష్ట్ర విధాన మండలి (Legislative Council)లో థాకరే మాట్లాడుతూ, కర్ణాటకలోని ఒక్క అంగుళం భూమి కూడా తమకు అవసరం లేదని, తమ భూభాగం మాత్రమే తాము కోరుతున్నామని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ, కర్ణాటకలో కలుపుకున్న మహారాష్ట్ర ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా (Union Territory) ప్రకటించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. ఈ తీర్మానాన్ని ఇవాళే సభ ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వివాదాస్పద ప్రాంతాల్లోని ప్రజలంతా మరాఠీ మాట్లేడేవారని థాకరే చెబుతూ, భాషా ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగేటప్పటికే సరిహద్దుల్లో మరాఠీ భాష వెళ్లూనుకుందన్నారు. ఏళ్ల తరబడి ప్రజలు మరాఠా మాట్లాడుతూ అక్కడ నివసించే వారని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వివాదాస్పద ప్రాంతాలైన బెళగవి, కార్వార్, నిప్పని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌కు తాము మద్దతిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై విమర్శలు ఎక్కుపెడుతూ, సరిహద్దుల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి చాలా దూకుడుగా ఉంటే షిండే మాత్రం మౌనం పాటిస్తున్నారని థాకరే అన్నారు.

రాజకీయం చేయకండి: సీఎం

కాగా, కర్ణాటకతో సరిహద్దు వివాదాన్ని విపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈనెల 19న అసెంబ్లీ మాట్లాడుతూ అన్నారు. సరిహద్దు ప్రాంతవాసులకు బాసటగా విపక్షాలు ఏకతాటిపై నిలబడాలని సూచించారు. ఇతర విషయాలు రాజకీయం చేసినా సరిహద్దు వివాదాన్ని మాత్రం ఎవరూ రాజకీయం చేయరాదని, వివాదం సుప్రీంకోర్టు ముందు ఉన్నందున వేచిచూడాలని అన్నారు. రాజకీయాల చేయడం తగదని హితవు పలికారు.

Updated Date - 2022-12-26T17:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising