Corona: చైనా నుంచి వచ్చిన మహిళకు కరోనా..ఆమె కూతురుకూ..
ABN, First Publish Date - 2022-12-27T22:42:54+05:30
చైనా నుంచి తమిళనాడుకు వచ్చిన ఓ మహిళ, కరోనా పాజిటివ్‌గా తేలారు. ఆమె కూతురు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా(China) నుంచి తమిళనాడుకు(TamilNadu) వచ్చిన ఓ మహిళ, కరోనా పాజిటివ్‌గా తేలారు. ఆమె కూతురు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. తల్లీకూతుళ్లు ఇద్దరు చైనా నుంచి శ్రీలంక(SriLanka) మీదుగా మదురై చేరుకున్నారు. ‘‘ఇద్దరినీ ఐసోలేషన్‌లో ఉంచాం. వారి శాంపిళ్లను జన్యువిశ్లేషణ పరీక్షలకు పంపించాం.’’ అని మదురై కలెక్టర్ తెలిపారు. అంతకుమునుపు..చైనా నుంచి ఆగ్రాకు చేరుకున్న నలభై ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలారు.
కాగా.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు టీకా ఇన్‌కోవాక్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ స్లాట్లు మంగళవారం నుంచి కొవిన్ పోర్టల్‌లో(CoWin Portal) అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు మార్కెట్లలో ఇది 800 రూపాయలకు అందుబాటులో ఉండగా.. ప్రభుత్వానికి మాత్రం రూ 325కు సరఫరా చేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చైనా ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని జపాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
Updated Date - 2022-12-27T23:38:17+05:30 IST