ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా

ABN, First Publish Date - 2022-10-29T01:01:38+05:30

సముద్రాల దగ్గర ఉండే ఈ పక్షిని ‘సీగల్‌’ అని పిలుస్తారు. ఆర్కిటిక్‌ ఖండంలో తప్ప మిగిలిన ప్రతిచోటా సముద్రాన్ని నమ్ముకునే ఇవి జీవిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్రాల దగ్గర ఉండే ఈ పక్షిని ‘సీగల్‌’ అని పిలుస్తారు. ఆర్కిటిక్‌ ఖండంలో తప్ప మిగిలిన ప్రతిచోటా సముద్రాన్ని నమ్ముకునే ఇవి జీవిస్తాయి. వీటిని రౌడీ బర్డ్స్‌ అని కూడా పిలస్తారు.

ఈ పక్షులు తెలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఇవి 120 గ్రాములనుంచి కేజీన్నర బరువు ఉంటాయి. చిన్న గల్స్‌కి రెండు అడుగులు ఉంటే.. నల్లగా ఉండే పెద్ద గల్‌కి 5 ఫీట్ల పొడవైన రెక్కలుంటాయి.

ఈకలు, ప్లాస్టిక్‌, చెత్తాచెదారం, ఆకులతో గూళ్లను కడతాయి.

మూడు లేదా నాలుగు గుడ్లు పెడతాయి. ఆడపక్షి గుడ్లమీద కూర్చుని నిద్రపోయినపుడు.. దానికి తోడుగా ఎంత సేపయినా మగ పక్షి పక్కనే మెలకువతో ఉండి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. గుడ్లను పొదిగే కాలం నెల రోజులు.

ఇవి గుంపులుగా ఉంటాయి. ఒకప్పుడు సముద్రాల దగ్గరే ఉండేవి. ఇపుడు చెరువులు, నదులతో పాటు జనావాసాల మధ్యకు కూడా వస్తున్నాయి.

సీగల్స్‌ పుట్టినపుడు వాటిపై నల్లని చుక్కలు ఉంటాయి. వీటిని నక్కలు, గద్దలు, వేల్స్‌, డాల్ఫిన్స్‌ తినేస్తాయి. 20 సంవత్సరాలు జీవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 28 రకాల సీగల్స్‌ ఉంటాయి.

ఇవి తెలివైన పక్షులు. ఇతర పక్షుల ఆహారాన్నే కాదు.. పిక్నిక్‌ వెళ్లినపుడు మనుషులు తీసుకెళ్లే ప్లాస్టిక్‌ గ్లాసులు, తిండి, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తాయి.

ఉప్పునీటిని కూడా తాగి బతుకుతాయి. అయితే ఆ ఉప్పుదనం లోపలికి పోకుండే ఉండే నిర్మాణం ఇందులో ఉంటుంది.

చేపలు, పురుగులు, పండ్లు, ఇతర పక్షుల గుడ్లు, తన జాతి పక్షుల గుడ్లును తింటాయి. అలా వీటి సంతతికి ఇవే శాపంగా పరిణమిస్తాయి.

Updated Date - 2022-10-29T01:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising