ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Students: భారత్ సర్కార్ హెచ్చరిక.. పాటించబోమన్న విద్యార్థులు!

ABN, First Publish Date - 2022-10-27T11:38:15+05:30

ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను ఉద్దేశించి.. ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌ను వీడాలని సూచించింది. ఏదైనా సహాయం కావాల్సి వస్తే.. ఎంబసీనీ సంప్రదించాలని వెల్లడించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిన సుమారు 1500 మంది భారత విద్యార్థులు స్పందించారు. తిరిగి ఇండియాకు వచ్చేందుకు(refuse to leave Ukraine) నిరాకరించారు. ఎంబసీ చెప్పినట్టే ఉక్రెయిన్‌లో భయానక పరిస్థులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ తమ భవిష్యత్తు దృష్ట్యా ఉక్రెయిన్‌ను వీడబోమని పేర్కొన్నారు. తామంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లమని... ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఇండియాలోని ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌ను పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఉన్న యూనివర్సిటీల్లో తమ చదువును కొనసాగించేందుకు అవకాశం లేదన్నారు. నిబంధనలను సడలించేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా లేనందనే తిరిగి ఉక్రెయిన్ బాట పట్టినట్టు వివరించారు.

భారత ప్రభుత్వం విముఖత

ఉక్రెయిన్-రష్యా(Ukraine - Russian) దేశాల మధ్య యుద్ధం మొదలవడంతోనే.. భారత ప్రభుత్వం(Govt of India) అక్కడ ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ఏర్పాట్లు ప్రారంభించింది. వేలాది మంది విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది. అలా వచ్చిన విద్యార్థుల్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌.. స్వదేశంలో తమ చదువును కొనసాగించలేకపోయారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువును కొనసాగించడానికి నిబంధనలు అనుమతించకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిబంధనలు సడలిస్తే.. దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం విన్నాక దాదాపు 1500 మంది భారత విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ బాట పట్టారు.

Updated Date - 2022-10-28T13:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising