ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: కనెక్టికట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’

ABN, First Publish Date - 2022-10-25T21:32:39+05:30

అమెరికాలోని కనేక్టికట్ రాష్ట్రంలో హార్ట్‌ఫోర్డ్ నగరంలో అక్టోబర్ 24న జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని(USA) కనేక్టికట్ రాష్ట్రంలో హార్ట్‌ఫోర్డ్ నగరంలో(Hartford) అక్టోబర్ 24న జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu Naidu) రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే మూడున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయన్నారు. జగన్(Jagan Mohan Reddy) అసమర్థ పాలన వల్ల అన్ని వర్గాల ప్రజల జీవనం అతలాకుతలమైందని, ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో.. కుక్కలు చింపిన విస్తరిలా అయిన రాష్ట్రాన్ని బాగు చెయ్యాలంటే ఒక్క చంద్ర బాబుపకే సాధ్యమని చెప్పారు. రాబోయే 2024 ఎన్నికల్లో NRI టిడిపి నాయకులు ఏపీలోని తమ తమ గ్రామాలకు వెళ్లి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వలన జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు NRI టిడిపి నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ(NRI TDP) నాయకులు తరణి పరుచూరి, అశ్విన్ అట్లూరి, ఎండురి శ్రీనివాస్, రావుల శ్రీనాథ్, సుధాకర్ తురగా, యోగేష్ అబ్బూరి, ప్రదీప్ గెడ్డం, తేజా రావెళ్ళ, ప్రదీప్ రావెళ్ళ, రాజశేఖర్ శాఖమూరి, దిలీప్ చిలకపతి, జాస్తి శ్రీకాంత్, రామారావు కాజ, పర్చూరి చక్రధర్, పాలడుగు భాస్కర్, నడిపినేని శ్రీధర్ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-25T21:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising