US: అదృష్టమంటే ఈ అవ్వదే.. 3రోజుల వ్యవధిలో మూడున్నర కోట్లు వచ్చి పడ్డాయి!
ABN, First Publish Date - 2022-11-04T09:07:11+05:30
ఒక లాటరీలో గెలుచుకున్న నగదును తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మరో లాటరీ టికెట్ కొనుగోలు చేసిందామె. అంతే.. రెండు రోజుల తర్వాత తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన రెండో లాటరీ టికెట్‌కు కూడా భారీ ప్రైజ్‌మనీ తగిలింది.
నెవార్క్: ఒకరికి తమ జీవితంలో ఒక లాటరీ (Lottery) గెలవడం అనేది పెద్ద అదృష్టమనే చెప్పాలి. కొందరి జీవితంలో అది జరగకపోవచ్చు కూడా. కానీ, అమెరికాకు (America) చెందిన ఓ వృద్ధురాలికి మాత్రం ఈ విషయంలో అదృష్టం తేనెపట్టుల పట్టుకుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఒక లాటరీలో గెలుచుకున్న నగదును తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మరో లాటరీ టికెట్ కొనుగోలు చేసిందామె. అంతే.. రెండు రోజుల తర్వాత తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన రెండో లాటరీ టికెట్‌కు కూడా భారీ ప్రైజ్‌మనీ తగిలింది. ఇలా మూడు రోజుల వ్యవధిలో వృద్ధురాలు రెండు లాటరీలు గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని నెవార్క్లో (Newark) ఉండే 70 ఏళ్ల ఓ వృద్ధురాలు అక్టోబర్ 20న ఓ లాటరీలో రూ. 82.80లక్షలు గెలుచుకుంది. దీంతో ప్రైజ్‌మనీ (Prizemoney) తీసుకోవడానికి డెలావర్ లాటరీ నిర్వాహకుల వద్దకు వెళ్లింది. వారి వద్ద నుంచి తాను గెలిచిన ప్రైజ్‌మనీ తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో డోవర్‌లోని టైగర్ మార్ట్‌లో మరో లాటరీ టికెట్‌ను కొనగోలు చేసింది. రెండు రోజుల తర్వాత తీసిన డ్రాలో ఆమె రెండోసారి కొన్న లాటరీ టికెట్‌కు కూడా రూ. 2.8కోట్ల ప్రైజ్‌మనీ తగిలింది. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే వృద్ధురాలు ఏకంగా రూ. 3.60కోట్ల వరకు సొంతం చేసుకుంది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇక ఈ రెండు లాటరీల ద్వారా తాను గెలుచుకున్న నగదులో ఎక్కువ భాగాన్ని తన రిటైర్మెంట్ ఫండ్‌లో పెట్టాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపింది.
Updated Date - 2022-11-04T11:42:11+05:30 IST