ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: తోటి భారతీయుడి మృతికి కారణమై.. మరణశిక్ష పడిన తెలుగోడికి బిగ్ రిలీఫ్

ABN, First Publish Date - 2022-12-22T08:07:42+05:30

తోటి భారతీయుడి మృతికి కారణమైన కేసులో మరణశిక్ష పడిన ఒక తెలుగు ప్రవాసీయుడు.. ఎట్టకేలకు జైలు నుంచి విడుదల కావడానికి చట్టపరంగా అడుగు ముందుకు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైలు నుంచి విడుదలకు అవకాశం

కోర్టుకు పత్రాలు సమర్పించిన సామాజిక కార్యకర్త అనురాధ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): తోటి భారతీయుడి మృతికి కారణమైన కేసులో మరణశిక్ష పడిన ఒక తెలుగు ప్రవాసీయుడు.. ఎట్టకేలకు జైలు నుంచి విడుదల కావడానికి చట్టపరంగా అడుగు ముందుకు పడింది. దీనికి సంబంధించి బుధవారం యూఏఈలోని ఫుజిరా న్యాయస్థానంలో తనజ్జుల్‌ కుత్బా అదీల్‌ పత్రాలను తెలుగు ప్రవాసీలకు న్యాయ సలహాలు ఇచ్చే తెలుగు సామాజిక కార్యకర్త అనురాధ సమర్పించారు. యూఏఈలోని ఫుజిరా పట్టణంలో ఒక భవన నిర్మాణం సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన కుమార్‌ రామావతార్‌ అనే తోటి కార్మికుడితో.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం మెండోరా గ్రామ వాసి మాకురి శంకర్‌ ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో రామావతార్‌ను శంకర్‌ కొట్టాడు. లిఫ్ట్‌ నిర్మాణం జరుగుతున్న చోట ఆరంతస్తుల నుంచి అతన్ని నెట్టేయడంతో.. కిందపడ్డ రామావతార్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై ఫుజిరా కోర్టులో కేసు నడిచింది. రామావతార్‌ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని ప్రాసిక్యూషన్‌ వాదించారు.

దీంతో ఏకీభవించిన కోర్టు 2009లో శంకర్‌కు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పిచ్చింది. ఈ తీర్పుపై శంకర్‌ 2011లో అప్పీల్‌కు వెళ్లగా.. అప్పీల్‌ కోర్టు కూడా అతణ్ని హంతకునిగా నిర్ధారించి మరణ శిక్షను సమర్థించింది. గల్ఫ్‌ దేశాలలోని ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం.. ఒకవేళ మృతుడి వారసులు క్షమిస్తున్నట్లుగా ప్రకటిస్తే మరణానికి కారకుడయిన శిక్ష పడిన వ్యక్తిని వదిలిపెట్టే వెలుసుబాటు ఉంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని మృతుడి వారసులు భారీ మొత్తంలో డబ్బు తీసుకొని శంకర్‌ను క్షమిస్తున్నట్లుగా పత్రాలను ఇచ్చారు. ఆ పత్రాలను యూఏఈలో తెలుగు ప్రవాసీలకు న్యాయ సలహాలు ఇచ్చే అనురాధ బుధవారం ఫుజిరా న్యాయస్థానంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా శంకర్‌ విడుదల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాయని, త్వరలో అతను విడుదల అవుతాడని అనురాధ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-22T15:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising