ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: అనూహ్య పరిణామం.. మునుపెన్నడూ లేని విధంగా..

ABN, First Publish Date - 2022-12-03T09:18:35+05:30

కువైత్‌లో (Kuwait) ఈ ఏడాది ప్రారంభం నుంచి అనూహ్యంగా విడాకుల కేసులు (Divorce cases) అమాంతం పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) ఈ ఏడాది ప్రారంభం నుంచి అనూహ్యంగా విడాకుల కేసులు (Divorce cases) అమాంతం పెరిగాయి. ఈ విషయం తాజాగా విడుదలైన అధికారిక డేటా ద్వారా బయటకు వచ్చింది. అలాగే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెళ్లిల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఏకంగా 3,226 వివాహాలు తక్కువగా నమోదయ్యాయి. ఇక గడిచిన 11 నెలల్లో 636 విడాకుల కేసులు నమోదయ్యాయి. వీటిలో కువైటీలు (Kuwaitis) 399 మంది ఉంటే.. నాన్-కువైటీలు (Non-Kuwaitis) 237 మంది ఉన్నారు. కాగా, విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్న జంటలు ఎక్కువగా చెబుతున్న కారణాలలో తమ మధ్య ఉన్న పరిష్కరించలేని విభేదాలు, అననుకూలతలు, సామాజిక విషయాలకు సంబంధించినవి ఉంటున్నాయి. కొన్ని కేసుల్లో మాత్రం చాలా సిల్లీ కారణాలు ఉన్నట్లు తాజాగా వెలువడిన డేటా పేర్కొంది. ఏదేమైనా గల్ఫ్ దేశంలో ఇలాంటి పరిణామం మునుపెన్నడూ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలాఉంటే.. 2016 నుంచి 2020 వరకు ఐదేళ్లకు సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ విడాకుల డేటాను ఇటీవల విడుదల చేసింది. ఈ ఐదేళ్లలో మొత్తం 36,345 విడాకుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 26,626 కువైటీ పౌరులకు సంబంధించిన కేసులైతే, 3,950 నాన్-కువైటీలకు చెందినవి. మరోవైపు 2021లో విడాకుల రేటు సైతం ఐదేళ్లలో అత్యధిక రికార్డును అందుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం 6,205 విడాకుల కేసులు నమోదయ్యాయి. వీటిలో కువైటీలకు చెందినవి 5,144 అయితే, నాన్-కువైటీలకు సంబంధించినవి 1,061 కేసులు ఉన్నాయి.

2016, 2017, 2018 సంవత్సరాల వారిగా గణాంకాలు ఇలా ఉన్నాయి..

* 2016లో నమోదైన మొత్తం విడాకుల కేసులు 7,223. వీటిలో 5,259 కేసులు కువైటీ మహిళలకు సంబంధించినవి. వీటిలో 4,386 కువైత్ భర్తలు, 873 నాన్-కువైటీ భర్తలు.

* 2017లో మొత్తం విడాకుల కేసులు 7,433. వీటిలో 5,402 కువైటీ మహిళల కేసులు ఉన్నాయి. వీటిలో 4,510 కువైత్ భర్తలు, 892 నాన్-కువైటీ భర్తలు ఉన్నారు.

* 2018లో నమోదైన మొత్తం విడాకుల కేసులు 7,869. వీటిలో 5,764 కువైటీ మహిళల కేసులు ఉన్నాయి. వీటిలో 4,839 కువైత్ భర్తలు, 925 నాన్-కువైటీ భర్తలు ఉన్నారు.

Updated Date - 2022-12-03T09:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising