ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: మాజీ అధ్యక్షుడి కీలక ప్రకటన.. 2024 ఎన్నికల్లో..

ABN, First Publish Date - 2022-11-05T09:58:36+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Former US president Donald Trump) తగ్గేదేలే.. అంటున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆరోపించిన ట్రంప్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Former US president Donald Trump) తగ్గేదేలే.. అంటున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆరోపించిన ట్రంప్.. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో (2024 President Elections) తాను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. గురువారం అయోవాలో (Iowa) జరిగిన ర్యాలీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్ల తాను పరాజయం పొందానని, ఈసారి కచ్చితంగా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను రెండుసార్లు పోటీ చేశానని చెప్పిన ఆయన.. 2020లో కంటే 2022లో ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఈ నెలలోనే వైట్‌హౌస్ (White House) కోసం మూడో బిడ్‌ను బహుశా వేయవచ్చని చెప్పారు. "ఇప్పుడు మన దేశాన్ని విజయవంతంగా, సురక్షితంగా, అద్భుతంగా మార్చడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అయోవా ర్యాలీలో ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల బిడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. అటు మాజీ అధ్యక్షుడి తాజా బిడ్‌ను పరిశీలిస్తున్నట్లు ముగ్గురు ట్రంప్ సలహాదారులు కూడా ధృవీకరించారు. ఇదిలాఉంటే.. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ అనుచరులు, మద్దతుదారులు ఎంతటి విధ్వంసం సృష్టించారో తెలిసిందే. ఏకంగా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు.

జనవరి 6న అసలేం జరిగిందంటే..

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ (Joe Biden) ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించి అలజడి సృష్టించారు. రక్షణగా భవనం బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు. వారిని శాంతింపజేసేందుకు తొలుత టీయర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది. దాంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అగ్రరాజ్యం చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

Updated Date - 2022-11-05T10:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising