ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai: రూ.30 కోట్లు గెలిచిన జగిత్యాల యువకుడు షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2022-12-28T20:48:34+05:30

పొట్ట కూటి కోసం ఎడారి దేశం వెళ్లి.. అక్కడ డ్రైవర్‌గా పని చేస్తూ లాటరీలో దాదాపు రూ.30కోట్లు గెలుచుకున్న జగిత్యాల యువకుడు( lucky winner) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుటుంబ సభ్యులను తన వద్దకు రప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో ఓ చేదు అనుభవం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: దుబాయిలో అదృష్టం కొద్ది లాటరీలో కోట్ల రూపాయాలు దక్కినా ఆ సంతోషాన్ని తన కుటుంబంతో పంచుకోవడానికి వారిని దుబాయికు పిలిపించుకోవడానికి అవసరమైన పాస్ పోర్టు కొరకు మాత్రం మాతృభూమిలో అదృష్టం కలిసిరావడం లేదు ఆ ప్రవాసీకి. తెలుగునాట పాస్ పోర్టు స్లాట్ లభించకపోవడంతో తన కుటుంబాన్ని నాగపూర్ పాస్ పోర్టు కార్యాలయానికి పంపించి అక్కడి నుండి పాస్ పోర్టు కొరకు దరఖాస్తు చేసి వారు దుబాయికు రావడానికి నిరిక్షీస్తున్నాడు.

దుబాయిలోని ఒక గుజరాతీ వజ్రాల వ్యాపారి వద్ద డ్రైవర్ గా పని చేసే జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగ్గుల అజయ్ (30)కి ఏమిరేట్స్ డ్రా లాటరీలో 15 మిలియన్ల దిర్హాంలు.. భారతీయ కరెన్సీలో 30 కోట్ల రూపాయాలు గెలుచుకోన్న విషయం తెలిసిందే. కానీ ఆ సంతోషాన్ని తన కుటుంబాన్ని దుబాయికు పిలిపించి వారి సమక్షంలో పంచుకోవడానికి పడుతున్న పాట్లు మాత్రం ఎవరికి తెలియవు.

అజయ్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భాద్యతలన్ని అతడిపై పడ్డాయి. అతడికి తల్లి, చెల్లి మరియు సోదరుడు ఉన్నారు. తమ జీవితంలోని అమూల్యమైన రూ.30 కోట్ల లాటరీ సంతోషాన్ని వారితో పంచుకోవడానికి ఉవ్విరూళ్ళుతున్నాడు. వారిని వెంట తీసుకెళ్ళి తాను లాటరీ టిక్కేట్ కొనడానికి ప్రొత్సహించిన యాజమాని మాయంక్ పంచోలికి కృతజ్ఞతలు తెలియజేయాలని నిశ్చయించుకున్నాడు. గుజరాతీ యాజమానితో తనకు ఒక ఉద్యోగి-యాజమాని సంబంధం కాకుండ ఒక పెద్ద దిక్కు, మార్గదర్శి అనుబంధత ఉందిని ఆయన చెప్పాడు.

తల్లి, సోదరిలకు పాస్ పోర్టులు లేకపోవడంతో వారిని పాస్ పోర్టు కొరకు దరఖాస్తు చేయించడానికి లాటరీ గెలిచిన మరుసటి రోజు నుండి ప్రయత్నిస్తున్నా పాటు తెలుగు రాష్ట్రాలలోని పాస్ పోర్టు కార్యాలయాలు, సేవా కేంద్రాలలో స్లాట్లు లేకపోవడంతో నిరాశ చెందాడు. చివరకు మహారాష్ట్రలోని నాగపూర్‌కు పంపించి దరఖాస్తు చేయించాడు. విచారణ పూర్తయి పాస్పోర్టులు చేతికు అందిన తర్వాత దుబాయి సందర్శక వీసాలకు దరఖాస్తు చేస్తానని, తన కుటుంబ సభ్యులు వచ్చి యాజమానికి కలిసి కృతజ్ఞతలు తెలిపిన తర్వాత ఆయన సూచనతో మాత్రమే దుబాయిలో వ్యాపారం ప్రారంభిచాలనుకుంటున్నట్టు అజయ్ తెలిపాడు.

అసలు లాటరీ వైపు తనకు ఏ మాత్రం ఇష్టం లేదని కానీ యాజమాని ప్రొత్సహించడం వలన మొదటిసారిగా రెండు టిక్కేట్లను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. కానీ మరుసటి రోజే తాను డబ్బులు గెలుచుకోన్నట్లుగా మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చిందని వివరించాడు. దుబాయిలో సగటు తెలంగాణ యువకులు నివాసముండే బర్ దుబాయి ప్రాంతంలో నివసించె అజయ్ లాటరీలో విజేతగా నిలిచినప్పటి నుండి తోటి వారందరరు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుతున్నారు.

తండ్రి మరణించిన తర్వాత చిన్న వయస్సులో కుటుంబ బాధ్యతలు అజయ్‌పై పడ్డాయి. పది సంవత్సరాలుగా గల్ఫ్‌లో ఉంటున్న అజయ్ దుబాయికు కంటే ముందు కువైత్, ఖతర్, ఆబుధాబిలలో కూడ డ్రైవర్‌గా పని చేసినా ఇప్పటి వరకు స్వంత ఇల్లు లేదు. దాన్ని నిర్మించే ప్రయత్నంలో అప్పుల పాలవగా ఇల్లు నిర్మాణం కూడా ఇంకా అసంపూర్తిగా ఉంది. ఆర్థిక అడ్డంకులు ఎన్ని ఉంటే ఏమి, ఆయన దాతృత్వానికి అవి అడ్డు పడలేదు. గ్రామంలో పేదలకు చేయూతనివ్వడానికి తుంగూర్ గ్రామ యువకులు నెలకోల్పుకొన్న ‘జాగో’ యువ బృందంలో అజయ్ చురుగ్గా పాల్గోంటాడు.

తన బ్యాంకు ఖాతాలో ఏ రోజు కూడా 50 దిర్హాంలకుపైగా నిల్వ ఎప్పుడు లేదని, అలాంటిది 15 మిలియన్ల దిర్హాంలు జమ కావడం తన ఇష్టదేవమైన సాయిబాబ కృపగా భావిస్తున్నట్టు అజయ్ పెర్కొన్నాడు. ఫోన్ మెసేజ్‌లో అంకెలను చూసి తాను మొదట నమ్మలేకపోయానని చెప్పాడు. కాగా..దుబాయి ప్రభుత్వ ఆమోదంతో ఏమిరేట్స్ డ్రా లాటరీ పూర్తి పారదర్శకతతో ప్రతి వారానికి రెండు సార్లు నిర్వహిస్తారు.

Updated Date - 2022-12-29T09:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising