ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NATS ‘థ్యాంక్స్ గివింగ్ బ్యాక్’కు చక్కటి స్పందన

ABN, First Publish Date - 2022-11-23T15:08:33+05:30

భాషే రమ్యం.. సేవే గమ్యం’ నినాదంతో ముందుకు వెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ నినాదంతో ముందుకు వెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు ‘మేముసైతం సమాజ హితం కోసం’ అంటూ ముందుకొచ్చారు. థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా దస్తులు, బూట్లు సేకరించారు. ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు.

చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి అలాగే చికాగో నాయకులకు దిశా నిర్దేశం చేశారు. వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్), కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తదితరులు తమ వంతు సహకారం అందించారు.

నాట్స్ చికాగో చాప్టర్ వలంటీర్లు సుమతి నెప్పలి, బిందు బాలినేని, ప్రతిభ, ప్రత్యూష, నవీన్ జరుగుల, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, పండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, రాజేష్ వీధులమూడి, సతీష్, వినోద్ బాలగురు, యజ్ఞేశ్, అరుల్ బాబు, శ్రేయాన్, అక్షిత, రుషిత, ఆరుష్ , ఆదిన్, వర్షిత్, కృష్ణఫణి, సంకీత్, నిరుక్త, నిత్య, సహస్ర, హన్సిక, అన్షిక, వేద, అనీష్ తదితరులు గివింగ్ బ్యాక్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా అవార్డులు అందించడం జరిగింది.

Updated Date - 2022-11-23T15:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising