ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu Student: ఇటలీలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. 22 రోజుల తర్వాత ఇంటికి మృతదేహం

ABN, First Publish Date - 2022-11-27T09:41:37+05:30

ఇటలీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే మృతిచెందిన విద్యార్థి మృతదేహాన్ని 22 రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు

పద్మారావునగర్‌, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఇటలీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే మృతిచెందిన విద్యార్థి మృతదేహాన్ని 22 రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పద్మారావునగర్‌ బంజారా అపార్ట్‌మెంటులో ఉంటున్న పి. రామచంద్రుడు కుమారుడు పి. వెంకటసాయి ఉదయ్‌కుమార్‌(28) ఇటలీ దేశంలో చదువుతున్నాడు. ఈ నెల 4న ఆ దేశంలోని ఓ ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు కుమారుడు చనిపోయినట్లు ఈ మెయిల్‌ వచ్చింది. దానిని చదివిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు స్థానిక కాలనీ వాసులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివా్‌స

గౌడ్‌ను కలిశారు. ఆయన ప్రమేయంతో 22 రోజుల తర్వాత శనివారం 11.30 గంటలకు వెంకటసాయి ఉదయ్‌కుమార్‌ మృతదేహం నగరానికి తీసుకొచ్చారు. డివిజన్‌ కార్పొరేటర్‌ కుర్మా హేమలత, కాలనీ అధ్యక్షుడు మామిడి బాల్‌రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, గోశాల సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.

Updated Date - 2022-11-27T09:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising