Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే..
ABN, First Publish Date - 2022-10-25T23:50:29+05:30
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు పలు ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.
ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) బ్రిటన్ ప్రధానిగా (UK PM)ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆర్థిక సమస్యలతో బ్రిటన్ సతమతమవుతున్న నేపథ్యంలో ఆయనకు కఠిన సవాళ్లు తప్పవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బ్రిటన్‌లో వస్తుసేవల ఉత్పత్తి పడిపోయింది. ఇన్‌స్టిట్యూప్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ అధ్యయనం ప్రకారం.. సప్లయ్ చైన్‌లో అవాంతరాల కారణంగా బ్రిటన్‌లో ఉత్పాదకత 2.6 శాతం క్షీణించింది. దేశ జీడీపీ కనీసం 1.4 శాతం మేర వృద్ధి చెందితేనే ఆర్థిక సమస్యల నుంచి కొంత మేర ఊరట లభిస్తుంది.
బ్రిటన్‌లో డిమాండ్ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నిరుద్యోగిత(Unemployment) పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం రిషికి పెను సవాలు విసురుతుందని అంటున్నారు.
అధిక ద్రవ్యోల్బణం కారణంగా బ్రిటన్ ప్రజలు ఇప్పటికే అల్లాడుతున్నారు. ఓ అంచనా ప్రకారం.. 2023 కల్లా ద్రవ్యోల్బణం పతాకస్థాయికి చేరుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం(Inflation) కట్టడి అంత సులభం కాకపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయంగా ఉంది.
రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అధికంగా ఉండటంతో జీవనవ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు కూడా తగ్గడం బ్రిటన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే అది ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రిషి ప్రభుత్వం ఎదుర్కోబోయే కఠిన పరీక్ష ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2022-10-25T23:57:41+05:30 IST