Kuwait: విజిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్ల ఫీజులు మూడింతలు!
ABN, First Publish Date - 2022-11-14T11:04:36+05:30
విజిట్ వీసా, రెసిడెన్సీ పరిట్ల విషయంలో కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విజిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్ల జారీకి సంబంధించిన నిబంధనల్లో కువైత్ ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే
ఎన్నారై డెస్క్: విజిట్ వీసా, రెసిడెన్సీ పరిట్ల విషయంలో కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విజిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్ల జారీకి సంబంధించిన నిబంధనల్లో కువైత్ ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విటిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్ల ఫీజులు రెండు నుంచి మూడింతలు పెరగొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ఈ నెలాఖరున జరిగే సమావేశంలో ఇంటీరియర్ మినిస్టర్ షేక్ తలాల్ అల్ ఖలేద్ అల్ సాహెబ్ పాల్గొని.. దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లఘించిన వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలిపింది. అతి త్వరలోనే వీటిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది.
Updated Date - 2022-11-14T11:04:39+05:30 IST