America అధ్యక్ష ఎన్నికలు.. పోటీపై మిచెల్ ఒబామా ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2022-11-18T16:37:12+05:30
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్యామణి.. మిచెల్ ఒబామా ఎట్టకేలకు నోరు విప్పారు. గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనపై ఆమె కీలక..
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్యామణి.. మిచెల్ ఒబామా ఎట్టకేలకు నోరు విప్పారు. గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మిచెల్ ఒబామాకు గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న ప్రశ్న ఏంటి? జో బైడెన్ పాలనపై ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా 2009లో ఎన్నికయ్యారు. తర్వాత ఎన్నికల్లో కూడా విజయం సాధించి.. 2017 వరకూ అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య మిచెల్ ఒబామా.. అమెరికా ప్రథమ పౌరురాలిగా వ్యవహరించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అమెరికా ప్రథమ పౌరురాలిగా మిచెల్ ఒబామా కొనసాగుతున్న సమయంలోనే ఆమెకు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘మీరు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా?’ అనే ప్రశ్నను అప్పట్లో ఆమె చాలా సార్లు ఎదుర్కొన్నారు.
అయితే.. అప్పట్లో ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకపోడంతో.. తాజాగా అదే ప్రశ్న ఆమెకు మరోసారి ఎదురైంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్టు తాజాగా మరోసారి ప్రకటించేశారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తాను మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నట్టు చెప్పేశారు. ఈ క్రమంలో మిచెల్ ఒబామాకు పాత ప్రశ్నే మరోసారి ఎదురైంది. అయితే ఈసారి ఆమె ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు. ‘రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా?’ అనే ప్రశ్నకు స్పందించిన మిచెల్ ఒబామా.. ‘నో’ అంటూ బదులిచ్చేశారు. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. బాగా పరిపాలిస్తున్నారని కితాబిచ్చారు.
Updated Date - 2022-11-18T16:42:13+05:30 IST