Viral News: మతి ఉండే ఆ పని చేయబోయిందా.. 37వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్తుంటే.. ఈ మహిళ..
ABN, First Publish Date - 2022-11-30T15:59:16+05:30
ప్రయాణికులు అందరూ విమానంలోకి ఎక్కేశారు. దీంతో ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. దాదాపు 37వేల ఎత్తులో ఆ విమానం గమ్యం వైపుగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో విమానంలోనే ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తోటి ప్రయాణికులకు..
ఎన్నారై డెస్క్: ప్రయాణికులు అందరూ విమానంలోకి ఎక్కేశారు. దీంతో ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. దాదాపు 37వేల ఎత్తులో ఆ విమానం గమ్యం వైపుగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో విమానంలోనే ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తోటి ప్రయాణికులకు షాకిచ్చింది. ఆమె చేసిన పనికి.. ప్రయాణికులు సహా విమానం సిబ్బంది కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే..
అమెరికాలోని హ్యూస్టన్(Houston) నగరం నుంచి ఒహియో రాష్ట్రంలోని కొలంబస్(Columbus)కు కొంత మంది ప్రయాణికులతో సౌత్‌వెస్ట్ విమానం బయల్దేరింది. ఈ క్రమంలో ఫ్లైట్.. 37వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా.. అదే విమానంలో ప్రయాణిస్తున్న 34ఏళ్ల మహిళ అకస్మాత్తుగా తన సీట్లోంచి లేచింది. అనంతరం వెనక భాగంలో ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చుంది. కిటికీ గుండా కొద్ది సమయం బయటకు చూసిన ఆమె.. ఆ తర్వాత ఇతర ప్రయాణికులకు షాకిచ్చింది. ‘జీసెస్ నన్ను ఈ ఫ్లైట్ డోర్ తెరవమంటున్నాడు.. ఆయనే నన్ను ఈ విమానంలో ప్రయాణించమన్నాడు’ అని పేర్కొంటూ విమానం డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది.
దీంతో విమానం సిబ్బంది సహా.. ఆమె తోటి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అనంతరం ఆమెను బంధించారు. అయినా.. ఆమె అలానే అరవడంతో.. ఫైలెట్లు విమానాన్ని ఆర్కన్‌సాస్ రాష్ట్రంలోని బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్టు(Bill and Hillary Clinton National Airport )లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఆ మహిళను ఫెడరల్ అధికారులకు అప్పగించారు. దీంతో సదరు మహిళను అరెస్ట్ చేసిన అధికారులు.. ఆమెను జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవడంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - 2022-11-30T16:05:14+05:30 IST