Canadaలో భారతీయుడికి అరుదైన గౌరవం.. ప్రముఖ యూనివర్సిటీకి..

ABN, First Publish Date - 2022-11-21T09:08:30+05:30

భారతీయుడికి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనిర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC)గా నియామయం అయ్యారు. కెనడాలోని ప్రాఖ్యాత McGill University.. భారత్‌కు చెందిన

Canadaలో భారతీయుడికి అరుదైన గౌరవం.. ప్రముఖ యూనివర్సిటీకి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయుడికి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనిర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC)గా నియామయం అయ్యారు. కెనడాలోని ప్రాఖ్యాత McGill University.. భారత్‌కు చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్టు ప్రొఫెసర్ హెచ్ డీప్ సైని (H Deep Saini)ని ప్రిన్సిపల్, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హెచ్ డీప్ సైని బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపింది.

కాగా.. ఈ యూనివర్సిటీలో దాదాపు 10వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో దాదాపు 27శాతం మంది భారతీయులే. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇది 31వ స్థానంలో ఉంది. అదే కెనడాలో మాత్రం నెంబర్ యూనిర్సిటీగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఇండియాలో పుట్టి పెరిగిన హెచ్ డీప్ సైని.. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బోటనీలో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని University of Adelaide నుంచి ప్లాంట్ ఫిజియాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

Updated Date - 2022-11-21T09:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising