ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SATA: అరబ్బు నేలలోని ఎత్తయిన అందమైన పర్వతాలపై తెలుగు ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-12-25T13:31:38+05:30

అసీర్ ... గల్ఫ్ దేశాలలోని స్విట్జర్లాండ్. సువిశాల ఇసుక ఎడారులకు దూరంగా సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఆకుపచ్చని పొదలు మరియు ఎల్లప్పుడు చల్లగా ఉండే ఆహ్లదకరమైన వాతవారణం ఈ ప్రాంతం సొంతం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభాలో సాటా భారతీయం, భారత మాత గొప్పతనం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అసీర్ ... గల్ఫ్ దేశాలలోని స్విట్జర్లాండ్. సువిశాల ఇసుక ఎడారులకు దూరంగా సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఆకుపచ్చని పొదలు మరియు ఎల్లప్పుడు చల్లగా ఉండే ఆహ్లదకరమైన వాతవారణం ఈ ప్రాంతం సొంతం. ఈ అసీర్ రాష్ట్ర రాజధానియే అభా. ప్రకృతి రమణమీయమైన వాతవారణానికి తోడుగా బలమైన అరబ్బు తెగలకు ఈ ప్రాంతం కేంద్రం. ఆధునిక సౌదీ అరేబియా నెలకోల్పడంలో ఈ ప్రాంత తెగల అరబ్బులు సౌదీ నవనిర్మాత అబ్దుల్ అజీజ్‌కు అండగ నిలిచారు. ఈ రకమైన నేపథ్యం ఉన్న అభా ప్రాంతంలో తెలుగు వారితో భారతీయులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ప్రముఖ నగరాలు రియాద్, జెడ్డాలకు దూరంగా ఉన్న అభాలో తెలుగు ప్రవాసీయులలో అందమైన అల్ సుదా మంచు పర్వతాలలోని రోడ్లను శుభ్రం చేసే కార్మికుల నుండి మోదలు కింగ్ ఖాలీద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుల వరకకు అందరు ఉన్నారు. వీరు సదూర ప్రాంతాలలో ఉన్న రియాద్, జెడ్డా నగరాలకు వెళ్ళడం జరగదు. అందుకని ఆయా నగరాలలో తరుచుగా జరిగే సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం అనేది కుదరదు.

ఈ పరిస్ధితులలో సౌదీ అరేబియాలోని తోటి తెలుగు వారందర్ని అనుసంధానం చేస్తున్న తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ మహా నగరాలైన రియాద్, జెడ్డాలే కాకుండా కొండ ప్రాంతాలైన అల్ సుదా, అభా మొదలగు ప్రాంతాలలో ఉంటున్న తెలుగు ప్రవాసీయులను ఒక దగ్గర చేర్చడానికి మొదటిసారిగా అభాలో ఇటీవల భారతీయ ఉత్సవాన్ని నిర్వహించింది. ఒక్క తెలుగువారే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులను కూడా కలుపుకోని నిర్వహించిన ఈ భారతీయ ఉత్సవంలో ముఖ్య అతిథిగా భారతీయ కాన్సుల్ జనర్ మోహమ్మద్ షాహీద్ ఆలం పాల్గొన్నారు. సాటా అధ్యక్షుడు కె.వి. మల్లేషన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అభాలో నివాసముండే సూర్యపేట జిల్లాకు చెందిన డాక్టర్ తెడ్ల జయశంకర్, స్వాతీ దంపతులు అన్ని తామై నిర్వహించి అతిధుల మనస్సును చూరగొన్నారు. భారతమాత గొప్పతనాన్ని తాము ప్రదర్శించామని మల్లేషన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మజార్ హుస్సేన్, తేజు, లక్ష్మణ్, చారి రాజ్, ఖుద్రత్, సునీల్ కుమార్, జెన్నీ, విజయ నార్నేలు కూడా వివిధ భాద్యతలను నిర్వహించారు. తమిళనాడు సాంస్కృతిక కార్యక్రమాలను దేవ, హరీష్, రాంకుమార్ నిర్వహిస్తే.. కర్ణాటక కార్యక్రమాలను విద్య శ్రేయస్ నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నాటకాలు, తెలుగు గాయకుడు అంజద్ హుస్సేన్ పాడిన సినీ పాటలు సభికులను అలరించాయి. సౌదీ అరేబియా ఎడారిలోని ప్రతి అడుగడుగున తెలుగు వారిలో భారతమాత గొప్పతనాన్ని నింపడానికి 'సాటా' ప్రయత్నిస్తుందని మల్లేషన్ అన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా వివిధ పండుగలు, పిల్లల ప్రదర్శనలు, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను 'సాటా' నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. త్వరలో సంక్రాంతి ఉత్సవాలను కూడా దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో పెద్ద సంఖ్యలో ప్రవాసులు పాల్గొనాలని మల్లేషన్ కోరారు.

Updated Date - 2022-12-25T13:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising