ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: తానా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

ABN, First Publish Date - 2022-10-30T21:22:58+05:30

తానా కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. కోవిడ్ సేవలకు TANA తానా కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్ అవార్డు, బంగారు పతకం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానా కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. కోవిడ్ సేవలకు TANA తానా కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్ అవార్డు, బంగారు పతకం దక్కింది. ఇక తానా సంస్థకు బహుకరించిన రెడ్‌క్రాస్ అవార్డు, బంగారు పతకాన్ని తానా టీమ్స్ స్క్వేర్ చైర్ శ్రీ కాకర్ల సురేష్ అందుకున్నారు. 1977 సంవత్సరంలో నార్త్ అమెరికాలో స్థాపించబడి తన సేవలతో విశ్వవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న తానా అరుదైన గుర్తింపుని, గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా రెండు మెడల్స్ అందుకుంది. ఈ అద్భుత సంఘటనకు విజయవాడ వేదికకైంది.

కోవిడ్‌కు చిక్కి ప్రజలు విలవిల్లాడుతున్న దురదృష్ట సమయంలో, ఎప్పటిలాగే తానా తన సహృదయతను చాటుకుంది. కరోనా రెండో వేవ్ సందర్భంగా కోవిడ్ రోగులు విపరీతమైన భయాందోళనలకు గురైన సమయమది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ మహమ్మారి వల్ల, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ప్రాణ రక్షక మందులు తగినన్ని లభించక ప్రజలు విలవిల్లాడిన తరుణమది.

ఆనాటి అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి నేత్రత్వంలో, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో కార్యవర్గం మొత్తం కార్యోన్ముఖమై, రంగలోకి దిగింది తానా సేవా సేన. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు తన మార్క్‌ని చూపించే శిరీష తూనుగుంట్ల తన ఎన్నికల పని కూడా పక్కన పెట్టి రేయింబవళ్ళు కష్ట పడి పనిచేశారు. 24 గంటలు అందు బాటులో ఉండే విధంగా tanacovid 19.com website అందుబాటులోకి తెచ్చి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఏ హాస్పిట్‌లో బెడ్స్, ఆక్సిజన్ వసతి, మందులు దొరుకుతున్నాయో వివరాలు కూడా ఇచ్చారంటే తానా ఎలా పనిచేసిందో ఎవరైనా ఊహించుకోవచ్చు.

రెండు రాష్ట్రాల రోగులకు సహాయ సహకారాలందించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో తానా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సమన్వయంతో ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించింది. 40,000 మెడికల్ కిట్స్, 650 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 120 వెంటిలేటర్స్‌ను రెడ్ క్రాస్‌ ద్వారా రోగులకు పంపిణి చేసింది. వాటితో పాటు నిత్యావసర సరుకులు, మాస్కులు, అందజేసి ఎంతో మందిని ఆదుకుంది తానా. ఈ విశిష్ట సేవల్ని గుర్తించి తానా సంస్థకు, ఈ సేవా కార్యక్రమ నిర్వాహణలో కీలక భూమిక పోషించిన శిరీష తూనుగుంట్లకు విశిష్ట సేవా గోల్డ్ మెడల్స్ ప్రకటించింది.

విదేశాల్లో ఉండి కూడా తమ మాతృభూమిపై మమకారం తగ్గక పోవడమే కాకుండా ఆపద, అవసరాల్లో మేము మీకు అండగా ఉంటామని ప్రపంచానికి ప్రకటించిన సేవామూర్తులకు ఇది తగిన గుర్తింపు అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్ నెల 28న జరిగిన పురస్కారాల ప్రదాన సభలో రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన బ్రహ్మాండమైన సభలో ఈ అవార్డులు అందజేశారు. తానా తరుపున కాకర్ల సురేష్, శిరీష తూనుగుంట్ల తరపున ఆమె తండ్రి మిట్టపల్లి పాండు రంగారావు ఈ అవార్డులు అందుకున్నారు.

Updated Date - 2022-10-30T21:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising