ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Muscat: మస్కట్‌లో ఘనంగా యాదాద్రీశుడి కల్యాణం

ABN, First Publish Date - 2022-11-19T07:21:23+05:30

అది అనాదిగా ఇస్లాం మతం విలసిల్లుతున్న అరబ్‌ నేల. అక్కడ ముస్లింల ప్రాబల్యమే చాలా ఎక్కువ. అలాంటి గడ్డపై వేద మంత్రాలు మార్మోగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరబ్‌నేలపై తొలిసారిగా నిర్వహించిన తెలుగువారు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: అది అనాదిగా ఇస్లాం మతం విలసిల్లుతున్న అరబ్‌ నేల. అక్కడ ముస్లింల ప్రాబల్యమే చాలా ఎక్కువ. అలాంటి గడ్డపై వేద మంత్రాలు మార్మోగాయి. గల్ఫ్‌ దేశాల చరిత్రలోనే తొలిసారిగా యాదగిరిగుట్ట పండితులు లక్ష్మీనరసింహస్వామి కల్యాణా న్ని జరిపించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. మస్కట్‌లోని దార్సైత్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ కృష్ణ ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పం డువగా జరిగింది. ఒమన్‌ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట అర్చకు ల బృందం వచ్చింది. తెల్లవారుఝామున 5 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వ చ్చారు. యాదిగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీ నరసింహాచార్యుల నేతృత్వంలో మంగళగిరి నర్సింహమూర్తి ఇతర అర్చకుల బృందం వేడుకను శా స్త్రోక్తంగా జరిపించింది.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణ వేడుకల్లో భాగంగా ఉదయం గజవాహన సేవను ఆల య తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం అష్టభుజి ప్రాకారమండపంలో కల్యాణ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.39,79,146 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, యాదగిరిక్షేత్రంలో మిగిలిన పనులు పూర్తిచేసి భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని సీ ఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్వామి ని దర్శించుకున్న అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆలయ విస్తరణ పనులపై సమీక్షించారు.

Updated Date - 2022-11-19T07:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising