Telugu Expats: ఒమాన్‌లో భక్తిశ్రద్ధలతో సహస్ర లింగార్చన
ABN, First Publish Date - 2022-11-15T07:51:21+05:30
ఎడారి దేశంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య సహస్ర లింగార్చన కార్యక్రమం కన్నులపండువగా సాగింది.
ఘనంగా నిర్వహించిన తెలుగు కుటుంబాలు
గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి : ఎడారి దేశంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య సహస్ర లింగార్చన కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ఒమాన్‌లో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. మస్కట్‌లో ప్రముఖ వేద పండితుడు ధర్మపురి విజయకుమార్ ఆధ్వర్యంలో లింగార్చన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 3 వేల మంది అబూహైతం ఫామ్‌కు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. వన భోజనాల్లో 21కి పైగా తెలుగు వంటకాలను వడ్డించారు. కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద శ్లోకాల పఠన పోటీల్లో నెగ్గిన పోరాల అగ్రగణ్య నాయుడు, అనన్య తుంగూరి, శ్రీవత్సలకు, రంగవల్లి పోటీల విజేతలు సాహిసి, సాయి స్మరణ్, ఉదయ్, ఉష, హర్షిణికి బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు రాందాస్, మధుసూధన్, వెంకట్, అనిల్ కుమార్‌లు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Updated Date - 2022-11-15T07:51:23+05:30 IST