NRI: సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ దౌత్యవేత్తలతో తెలుగు ప్రవాసీ సంఘం ప్రతినిధుల సమావేశం
ABN, First Publish Date - 2022-10-22T19:18:28+05:30
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీ ప్రముఖులు ఇటీవల భారతీయ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా(Saudi Arabia) రాజధాని రియాధ్ నగరంలో ప్రవాసీయుల సంక్షేమ, సాంస్కృతిక ఇతరత్రా విషయాలపై తెలుగు ప్రవాసీ ప్రముఖులు ఇటీవల భారతీయ ఎంబసీ(Indian embassy) అధికారులతో సమావేశమయ్యారు. పెరిగిపోతున్న తెలుగు ప్రవాసీయుల సమస్యల పరిష్కార విధానాలు, అదే విధంగా ఉల్లాసం కొరకు చేపట్టాల్సిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నుల గురించి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా అధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్ నేతృత్వంలో ప్రతినిధులు దుగ్గపు ఎర్రన్న, కొరుపొలు సూర్యరావు, చిట్లూరి రంజీత్ కుమార్, గుండబోగుల ఆనందరాజు, జానీ బాషా శేఖ్, మహేంద్ర వాకాటిలు ఎంబసీ సీనియర్ అధికారి సజీవ్, ఇతర దౌత్యవేత్తలతో సమావేశమై చర్చించారు. అధికార పరిమితులలో కూడా మానవీయ కోణంతో అనేక మంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సజీవ్‌ను అభినందిస్తూ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువ కప్పి సన్మానం చేశారు. సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి తోటి తెలుగు ప్రవాసీయులు మరింత చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు తమతో సమావేశమైన ప్రతినిధులకు సూచించారు.
Updated Date - 2022-10-22T19:18:40+05:30 IST