ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visa on arrival: భారత్ నుంచి థాయ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' కోసం 7రేట్లు పెరిగిన దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-12-03T12:46:02+05:30

భారత్ నుంచి థాయ్‌ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' (eVisa on arrival) కోసం ఈ ఏడాది దరఖాస్తులు దాదాపు 7రేట్లు పెరిగినట్లు వీసా ఔట్‌సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్పెషలిస్ట్ వీఎఫ్ఎస్ గ్లోబల్ (VFS Global) గురువారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత్ నుంచి థాయ్‌ల్యాండ్ 'ఈ-వీసా ఆన్ అరైవల్' (eVisa on arrival) కోసం ఈ ఏడాది దరఖాస్తులు దాదాపు 7రేట్లు పెరిగినట్లు వీసా ఔట్‌సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్పెషలిస్ట్ వీఎఫ్ఎస్ గ్లోబల్ (VFS Global) గురువారం వెల్లడించింది. ముఖ్యంగా మార్చి నుంచి అక్టోబర్ మధ్య దరఖాస్తులు భారీగా వచ్చాయని తెలిపింది. ఇది 2022 చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని వీఎఫ్ఎస్ గ్లోబల్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా దాదాపు రెండేళ్లు ఆగిపోయిన ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు మార్చిలో ప్రారంభం కావడం, అప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడంతో మనోళ్లు విదేశాలకు విహారయాత్రలు, ఇతర పనుల కోసం క్యూకట్టారు. ఈ క్రమంలోనే థాయ్‌ల్యాండ్ ఈ-వీసా ఆన్ అరైవల్‌కు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా గతేడాదితో పోలిస్తే ఏడు రేట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇదిలాఉంటే.. వీఎఫ్ఎస్ గ్లోబల్ 2019లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఆఫ్ థాయ్‌ల్యాండ్‌ (Immigration Bureau of Thailand) భాగస్వామ్యంతో ఈ-వీసా ఆన్ అరైవల్‌ సర్వీసులను ప్రారంభించింది.

Updated Date - 2022-12-03T12:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising