ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE Jobs: యూఏఈలో బాగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఇవే.. వాటి శాలరీలు ఇలా..

ABN, First Publish Date - 2022-11-30T10:44:11+05:30

మహమ్మారి కరోనా తగ్గుముఖం పట్టడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: మహమ్మారి కరోనా తగ్గుముఖం పట్టడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో 2023లో జాబ్ మార్కెట్ జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ దేశంలోని ప్రముఖ రిక్రూట్‌మెంట్ కంపెనీ మైఖేల్ పేజ్ ప్రాంతీయ డైరెక్టర్ జోన్ ఈడ్ తెలిపారు. వచ్చే ఏడాది యూఏఈలో డిమాండ్ ఉండే ఉద్యోగాలు, పే స్కేల్‌ వివరాలతో జాబ్స్ గైడ్‌ను విడుదల చేశారు. దీని ద్వారా నిరుద్యోగలు ఓ అంచనాకు రావచ్చని జోన్ పేర్కొన్నారు. యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, అనుభవం, జీతాల శ్రేణిని ఈ జాబ్ గైడ్ సవివరంగా తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మైఖేల్ జాబ్ గైడ్ అంచనా ప్రకారం యూఏఈలో డిమాండ్ ఉన్న జాబ్స్, శాలరీలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

* బ్యాంకింగ్- ఆర్థిక సేవలు

డిమాండ్ ఉన్న స్థానాలు: పెట్టుబడులు- సీనియర్ అనలిస్ట్/అసోసియేట్/సీనియర్ అసోసియేట్ గ్రోత్ వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ, ముఖ్య ఆర్థిక అధికారి, సమ్మతి అధికారి, ఫండ్ అకౌంటెంట్, పెట్టుబడిదారు సంబంధాలు, ఫైనాన్స్ మేనేజర్, మార్కెట్ రిస్క్ మేనేజర్

నెలవారీ పే స్కేల్:

హోల్‌సేట్ బ్యాంకింగ్ హెడ్ (ఈపీవీ): 98వేల దిర్హమ్స్(రూ.80లక్షలు) నుంచి లక్ష 77వేల దిర్హమ్స్(రూ.1కోటి 44లక్షలు)

సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్: 35వేల దిర్హమ్స్(రూ.28లక్షల 56వేలు) నుంచి 50వేల దిర్హమ్స్(రూ.40లక్షల 80వేలు)

రిలేషన్షిప్ ఆఫీసర్/అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్: 15వేల దిర్హమ్స్(రూ.12లక్ష 24వేలు) నుంచి 25వేల దిర్హమ్స్(రూ.20లక్షల 40వేలు)

* రిటైట్ బ్యాంకింగ్

కస్టమర్ బ్యాంకింగ్ హెడ్(ఈపీవీ): 95వేల దిర్హమ్స్(రూ.77లక్షల 53వేలు) నుంచి 2లక్షల దిర్హమ్లు(రూ.1కోటి 63లక్షల 22వేలు)

మేనేజర్ ఉత్పత్తులు/అమ్మకాలు: 25వేల దిర్హమ్ల(రూ.20లక్షల 40వేలు) నుంచి 40వేల దిర్హమ్స్(రూ.32లక్షల 64వేలు)

* బీమా

మేనేజింగ్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్(రూ.40లక్షల 80వేలు) నుంచి లక్ష 60వేల దిర్హమ్స్(రూ.48లక్షల 96వేలు)

సీనియర్ అసోసియేట్: 20వేల దిర్హమ్స్(రూ.16లక్షల 32వేలు) నుంచి 40వేల దిర్హమ్స్(రూ.32లక్షల 64వేలు)

* ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ (పెట్టుబడులు/నిధులు)

సీఎఫ్ఓ: 75వేల దిర్హమ్స్(రూ.61లక్షల 20వేలు) నుంచి లక్ష 70వేల దిర్హమ్స్(రూ.57లక్షల 12వేలు)

సీనియర్ అకౌంటెంట్: 16వేల దిర్హమ్స్(రూ.13లక్షలు) నుంచి 26వేల దిర్హమ్స్(రూ.21లక్షల 21వేలు)

అకౌంటెంట్: 14వేల దిర్హమ్స్(రూ.11లక్షల 42వేలు) నుంచి 23వేల దిర్హమ్స్(రూ.18లక్షల 77వేలు)

*డేటా- విశ్లేషణ

డిమాండ్ జాబ్స్: డేటా మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ నిపుణులు, ఆధునాతన విశ్లేషణలు/గణాంకాలు, డేటా ఇంజనీరింగ్ నిపుణులు, డేటా అనలిటిక్స్ అండ్ సైన్స్ అంతటా సీనియర్ నాయకత్వం, డేటా వ్యూహం అండ్ సలహా

శాలరీ వచ్చేసి..

చీఫ్ డేటా ఆఫీసర్: 80వేల దిర్హమ్స్(రూ.65లక్షల 28వేలు) నుంచి లక్ష 77వేల దిర్హమ్స్(రూ.62లక్షల 84వేలు)

చీఫ్ డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్: 55వేల దిర్హమ్స్(రూ.44లక్షల 88వేలు) నుంచి 73వేల దిర్హమ్స్(రూ.59లక్షల 57వేలు)

డేటా అనలిటిక్ మేనేజర్: 95వేల దిర్హమ్స్(రూ.77లక్షల 53వేలు) నుంచి 2లక్షల దిర్హమ్స్(రూ.1కోటి 63లక్షల 22వేలు)

డిజిటల్/ప్రొడక్ట్ అనలిటిక్స్ మేనేజర్: 40వేల దిర్హమ్స్(రూ.32లక్షల 64వేలు) నుంచి 60వేల దిర్హమ్స్(రూ.48లక్షల 96వేలు)

డేటా ఆర్కిటెక్ట్స్: 14వేల దిర్హమ్స్(రూ.11లక్షల 42వేలు) నుంచి 24వేల దిర్హమ్స్(రూ.192లక్షల 58వేలు)

బిగ్ డేటా ఇంజనీర్: 35వేల దిర్హమ్స్(రూ.28లక్షల 56వేలు) నుంచి 75వేల దిర్హమ్స్(రూ.61లక్షల 20వేలు)

*డిజిటల్

డిమాండ్ ఉన్న స్థానాలు: ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారు అనుభవ రూపకల్పన, డిజిటల్ నాయకత్వం, ఈ-కామర్స్ నిపుణులు, పర్ఫామెన్స్ మార్కెటింగ్

మంత్లీ శాలరీ స్కేల్:

డిజిటల్ మార్కెటింగ్ హెడ్: 40వేల దిర్హమ్స్(రూ.32లక్షల 64వేలు) నుంచి 60వేల దిర్హమ్స్(రూ.48లక్షల 96వేలు)

డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్: 28వేల దిర్హమ్స్(రూ.22లక్షల 85వేలు) నుంచి 38వేల దిర్హమ్స్(సుమారు రూ.31లక్షలు)

అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ మేనేజర్: 15వేల దిర్హమ్స్(రూ.12లక్ష 24వేలు) నుంచి 25వేల దిర్హమ్స్(రూ.20లక్షల 40వేలు)

ఎస్ఈఓ/ఎస్ఈఎం మేనేజర్: 18వేల దిర్హమ్స్(రూ.14లక్షల 68వేలు) నుంచి 28వేల దిర్హమ్స్(రూ.22లక్షల 85వేలు)

డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 12వేల దిర్హమ్స్(రూ.092లక్షల 79వేలు) నుంచి 18వేల దిర్హమ్స్(రూ.14లక్షల 68వేలు)

యూఎక్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్(రూ.40లక్షల 80వేలు) నుంచి 70వేల దిర్హమ్స్(రూ.57లక్షల 12వేలు)

విజువల్ డిజైనర్: 15వేల దిర్హమ్స్(రూ.12లక్ష 24వేలు) నుంచి 25వేల దిర్హమ్స్(రూ.20లక్షల 40వేలు)

చీఫ్ డిజిటల్ ఆఫీసర్: 60వేల దిర్హమ్స్(రూ.48లక్షల 96వేలు) నుంచి 90వేల దిర్హమ్స్(రూ.73లక్షల 44వేలు)

ఈ-కామర్స్ మేనేజర్: 25వేల దిర్హమ్స్(రూ.20లక్షల 40వేలు) నుంచి 35వేల దిర్హమ్స్(రూ.28లక్షల 56వేలు)

* ఇంజనీరింగ్ అండ్ తయారీ రంగం

డిమాండ్ ఉన్న స్థానాలు: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, సస్టైనబిలిటీ మేనేజర్, ప్లాంట్ మేనేజర్

నెలవారీ పే స్కేల్:

వైస్ ప్రెసిడెంట్: 90వేల దిర్హమ్స్ నుంచి లక్ష 50వేల దిర్హమ్స్

సీఈఓ: 80వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్

సీఓఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్

మేనేజింగ్ డైరెక్టర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్

జనరల్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్

ప్రాజెక్ట్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్

ప్రాజెక్ట్ మేనేజర్: 35వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్

ప్రాజెక్ట్ ఇంజనీర్: 10వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్

డిజైన్ మేనేజర్: 15వేల దిర్హమ్స్ నుంచి 30వేల దిర్హమ్స్

* ఫినాన్స్ అండ్ అకౌంటింగ్

డిమాండ్ ఉన్న స్థానాలు: కమర్షియల్ ఫినాన్స్ మేనేజర్/ఎఫ్‌పీ&ఏ మేనేజర్స్, కంప్లియన్స్/రిస్క్/ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్స్, బిజినెస్ కంట్రోలర్స్/ఫినాన్స్ కంట్రోలర్స్, చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్స్/ఫినాన్స్ డైరెక్టర్

మంత్లీ పే స్కేల్:

గ్రూప్/రిజినల్ సీఎఫ్ఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 2లక్షల దిర్హమ్స్

సీఎఫ్ఓ: 69వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్

ఎఫ్‌పీ&ఏ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 70వేల దిర్హమ్స్

ఫినాన్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్

ఎఫ్‌పీ&ఏ మేనేజర్: 27వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్

క్రెడిట్ మేనేజర్: 28వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్

జనరల్ లెడ్జర్ అకౌంటెంట్: 12వేల దిర్హమ్స్ నుంచి 22వేల దిర్హమ్స్

పేరోల్ మేనేజర్: 18వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్

చీఫ్ ఆడిట్ ఆఫీసర్: 53వేల దిర్హమ్స్ నుంచి లక్ష 40వేల దిర్హమ్స్

ఆడిట్ మేనేజర్: 25వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్

ట్యాక్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్

సీనియర్ ట్యాక్స్ అనలిస్ట్/అసోసియేట్: 25వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్

* హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్

డిమాండ్ ఉన్న స్థానాలు: నర్సులు, డాక్టర్లు, వైద్య శాస్త్రవేత్తలు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, ప్రాంతీయ సేల్స్ మేనేజర్, ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్

నెలవారీ పే స్కేల్:

డాక్టర్(సర్జన్): 80వేల దిర్హమ్స్ నుంచి లక్ష 60వేల దిర్హమ్స్

వైద్యుడు(కన్సల్టెంట్): 40వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్

వైద్యుడు(నిపుణుడు): 25వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్

నర్సు: 6వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్

వైద్య శాస్త్రవేత్త: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్

జనరల్ సేల్స్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి లక్ష 10వేల దిర్హమ్స్

ప్రాంతీయ సేల్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్

విక్రయ ప్రతినిధి: 15వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్

చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ (సీఎంఓ): 65వేల దిర్హమ్స్ 1లక్ష దిర్హమ్స్

మార్కెటింగ్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్

ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్

* మానవ వనరులు

డిమాండ్ ఉన్న జాబ్స్: టాలెంట్ డెవలప్‌మెంట్ నిపుణులు, ప్రాంతీయ హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ వ్యాపార భాగస్వాములు

మంత్లీ శాలరీ స్కేల్:

వీపీ హెచ్ఆర్/సీహెచ్ఆర్ఓ: 65వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్

హెచ్ఆర్ డైరెక్టర్: 55వేల దిర్హమ్స్ నుంచి 78వేల దిర్హమ్స్

హెచ్ఆర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్

టాలెంట్ అక్విజిషన్ మేనేజర్: 33వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్

టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్: 20వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్

* రిటైట్

డిమాండ్ ఉన్న పొజిషన్స్: మార్కెటింగ్ మేనేజర్లు, స్టోర్ నిర్వాహకులు, శిక్షకులు, సేల్స్ డైరెక్టర్స్, రిటైల్ డైరెక్టర్స్

నెలవారీ జీతం స్కేల్:

మేనేజింగ్ డైరెక్టర్/జనరల్ మేనేజర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్

రిటైల్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్

సేల్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్

సేల్స్ మేనేజర్: 20వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్

స్టోర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్

Updated Date - 2022-11-30T10:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising