ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dil Raju: అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.. ‘వారసుడు’ వివాదంపై దిల్ రాజు

ABN, First Publish Date - 2022-11-28T14:28:47+05:30

గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో ‘వారసుడు’ (Vaarasudu) సినిమా విడుదలపై వివాదం నడుస్తూ ఉంది. సంక్రాంతి (Sankranthi)కి స్ట్రయిట్ చిత్రాలకు ప్రయారిటీ ఇవ్వాలని కౌన్సిల్ నుంచి ప్రకటన రాగానే..

Dil Raju Open Heart with RK
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో ‘వారసుడు’ (Vaarasudu) సినిమా విడుదలపై వివాదం నడుస్తూ ఉంది. సంక్రాంతి (Sankranthi)కి స్ట్రయిట్ చిత్రాలకు ప్రయారిటీ ఇవ్వాలని కౌన్సిల్ నుంచి ప్రకటన రాగానే.. ఈ వివాదం మరింతగా ముదిరింది. కోలీవుడ్ (Kollywood) ఇండస్ట్రీలో కూడా దర్శకనిర్మాతలు ఈ వివాదంపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదంపై మాట్లాడని నిర్మాత దిల్ రాజు (Dil Raju).. ఫస్ట్ టైమ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK)లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ప్రతి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. అన్నింటిని సాల్వ్ చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 2023 సంక్రాంతికి విషయంలో ‘వారిసు’ అనే సినిమాని.. మేము మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి అని ప్రకటించాం. ఇప్పుడున్న సినిమాలలో సంక్రాంతికి డేట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ సినిమా మాదే. తెలుగు, తమిళ్, హిందీ.. మూడు లాంగ్వేజెస్‌లో చేస్తున్నామని చెప్పాం. మే నెలలో డేట్ అనౌన్స్ చేసిన సినిమాపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు. ఇందులో వాళ్లది కూడా తప్పులేదు. ఇప్పుడు ఒక్కటే ప్రొడక్షన్ హౌస్ నుంచి సంక్రాంతికి చిరంజీవి (Chiranjeevi)గారు, బాలకృష్ణ (Balakrishna)గారి సినిమాలు వస్తున్నాయి. అలాగే ‘ఆదిపురుష్’ (Adipurush) సంక్రాంతికి బిగ్ రిలీజ్ ఉంది. నిజంగా ‘ఆదిపురుష్ రిలీజ్ ఉన్నట్లయితే.. ఖచ్చితంగా థియేటర్ల విషయంలో పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది. ఎందుకంటే నాలుగు పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసేంతగా థియేటర్లు లేవు. ‘ఆదిపురుష్’ నైజాం, ఉత్తరాంధ్ర మేమే రిలీజ్. (Dil Raju Open Heart with RK)

మొన్నటి వరకు మైత్రీ సినిమాలు కూడా మేమే డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇప్పుడు వాళ్లు సొంతగా నైజాంలో ఆఫీస్ పెట్టుకుంటున్నారు. ఆఫీస్ పెట్టుకుంటున్నారు కాబట్టే.. వేరే వాళ్లు దీనిని అడ్వాంటేజ్ తీసుకుని.. న్యూస్ చేస్తున్నారు. వెనుక ఉన్న విషయం ఎవరికీ తెలియదు. సంక్రాంతి రేసు నుండి ‘ఆదిపురుష్’ తప్పుకుంది. ఇప్పుడు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలకు తెలుగు స్టేట్స్‌లో సరిపోయేంత కంఫర్టబుల్‌గా థియేటర్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మైత్రీ నుంచే రెండు సినిమాలు వస్తున్నాయి. 75 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి రెండు పెద్ద సినిమాలు.. వాళ్లే రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైమ్. అయితే మేము మే లో డేట్ అనౌన్స్ చేశాం. చిరంజీవిగారి సినిమా జూన్, జూలై‌లో అనౌన్స్ చేశారు. ‘ఆదిపురుష్’ ఏప్రిల్‌లో అనౌన్స్ చేశారు. బాలకృష్ణగారి సినిమా అక్టోబర్‌లో అనౌన్స్ చేశారు. వాస్తవానికి బాలకృష్ణ‌గారి సినిమా డిశంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. వర్క్ పూర్తి కాలేదనో.. సంక్రాంతి అడ్వాంటేజ్ అనో, సెంటిమెంట్ అనో.. సంక్రాంతికి పెట్టుకున్నారు. ఇప్పుడు మైత్రీ వాళ్లకి ప్రాబ్లమ్ లేదు. మాకూ ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ కౌన్సిల్‌కి.. అదీ సమస్య. మైత్రీ వాళ్లు వెళ్లి.. కౌన్సిల్‌కి ఏమైనా కంప్లయింట్ చేశారా? అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో దిల్ రాజు ఇలా మాట్లాడాడు కాబట్టి.. దిల్ రాజుని కౌంటర్ చేయడానికని దీనిని బయటికి తీసుకువచ్చారు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే.. సినిమా వ్యాపారాన్ని ఎవరం శాసించలేం. నైజాంలో మొత్తం 420 స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఏషియన్ సునీల్ వాళ్ల దగ్గర 100 స్క్రీన్లు ఉన్నాయి. 37 స్క్రీన్లు మాత్రం మావి. ఈ 100, మా 37 కాకుండా.. మిగతా వాటి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇస్తారు. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 10, 12 సినిమాలతో వాళ్లకి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా.. ఇలాగే వార్తలు నెగిటివ్‌గా నాపై వస్తుంటాయి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు.. ప్రాబ్లమ్ లేకుండానే ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు. అందుకు కారణం దిల్ రాజు అనే బ్రాండే..’’ అని నిర్మాత దిల్ రాజు ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. (Producer Dil Raju Open Heart with RK)

Updated Date - 2022-11-28T14:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising