ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య

ABN, First Publish Date - 2022-11-08T18:18:23+05:30

మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, కేసీఆర్‌కు ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanthi, Bjp
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana Chief Minister KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (BJP leader Vijayashanthi) విమర్శలు గుప్పించారు. మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, కేసీఆర్‌కు ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యథాతథంగా..

''మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య... కేసీఆర్ గారికి ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయింది. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆగమేఘాల మీద దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల తర్వాత దాన్ని పట్టించుకోవడం లేదు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. మునుగోడు ఉప ఎన్నికతో పాటే గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకం కూడా ముగిసింది. మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలను పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. నగదు బదిలీలో భాగంగా మునుగోడు పరిధిలో ఉన్న 4,739 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖతాల్లో అధికారులు నగదు జమ చేశారు. మరో 1,525 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా... ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో నగదు బదిలీకి బ్రేక్‌ పడింది. అప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమైన లబ్ధిదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బు విత్‌ డ్రా చేసుకోకుండా కూడా ఫ్రీజ్‌ చేశారు. ఎన్నిక పూర్తైన తర్వాత లబ్ధిదారులు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పుడు, కేసీఆర్ సర్కారు యూటర్న్‌ తీసుకోవడంతో మునుగోడులోని లబ్ధిదారులూ నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఏం కేసీఆర్ గారు ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు. మీరు చేసే మోసపు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో నీకు, నీ సర్కార్ కు తగిన సమాధానం చెప్పడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.


Updated Date - 2022-11-08T18:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising