Revenge Plan: సమాజం ఎటుపోతోంది.. ఓ 15 ఏళ్ల పిల్లాడు చేయాల్సిన పనులేనా ఇవి..!
ABN, First Publish Date - 2022-12-02T18:23:32+05:30
నేటి తరం పిల్లల్లో చాలా మందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్న చిన్న గొడవలకూ కక్ష పెంచుకుంటూ చివరకు దారుణాలకు తెగబడుతున్నారు. కొందరు పిల్లలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా..
నేటి తరం పిల్లల్లో చాలా మందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్న చిన్న గొడవలకూ కక్ష పెంచుకుంటూ చివరకు దారుణాలకు తెగబడుతున్నారు. కొందరు పిల్లలైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తనపై దాడి చేశాడనే కోపంతో ఓ వ్యక్తిపై 15ఏళ్ల బాలుడు పగ పెంచుకున్నాడు. చివరకు అతడు చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. సమాజం ఎటుపోతోంది.. పిల్లలు చేయాల్సిన పనులేనా ఇవి.. అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీ.. సడన్‌గా కిటికీ వైపు నుంచి దూసుకొచ్చిన మృత్యువు..
మహారాష్ట్రలోని (Maharashtra) కళ్యాణ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. స్థానికంగా నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడికి, ఓ వ్యక్తికి రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాలుడిపై దాడి చేశాడు. దీంతో అప్పటి నుంచి ఆ వ్యక్తిపై బాలుడు పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే అందుకు అవకాశం రాకపోవడంతో ఆ కోపాన్ని అతడి 9ఏళ్ల కూతురిపై చూపించాలని అనుకున్నాడు. ఇటీవల ఓ రోజు బాలికను కిడ్నాప్ చేసిన బాలుడు.. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు.
పాటలు పాడుతూ యువతులతో ప్రేమ.. నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు.. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో..
అంతటితో ఆగకుండా బ్లేడుతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించి బాలుడిని గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. తన మీద దాడి చేశాడనే కోపంతోనే అతడి కుమార్తెను హత్య చేశానని ఒప్పుకొన్నాడు. నిందితుడిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
Updated Date - 2022-12-03T16:07:45+05:30 IST