ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 ఏళ్ల క్రితం చేసిన వీర్యదానం.. 47 ఏళ్ల వయసులో అతడిని ఓ బిడ్డకు తండ్రిని చేసింది..!

ABN, First Publish Date - 2022-10-27T18:20:42+05:30

లండన్‌కు చెందిన పీటర్ హికిల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుతం ఇతడు ఆశ్చర్యకరంగా 47ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. ఇతను 1996లో సెలవుపై ఆస్ట్రేలియా వెళ్లాడు. అప్పుడు అతడి వయసున్న 21 సంవత్సరాలు. ఆ సమయంలో వెన్నులో కణితి ఉన్నట్లు బయటపడింది. వైద్య పరీక్షలు చేయించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో 26ఏళ్ల క్రితం తన వీర్యాన్ని దానం చేశాడు. తర్వాత క్యాన్సర్ చికిత్స కారణంగా తండ్రి అయ్యే అవకాశం లేకుండా పోయింది. పిల్లలు లేరనే లోటు ఆ దంపతులకు ఇప్పటికీ ఉండిపోయింది. అయితే గతంలో తాను వీర్యదానం చేసిన విషయం గుర్తుకువచ్చింది. ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటో తీసుకున్న జంట.. మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

లండన్‌కు చెందిన పీటర్ హికిల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుతం ఇతడు ఆశ్చర్యకరంగా 47ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. ఇతను 1996లో సెలవుపై ఆస్ట్రేలియా వెళ్లాడు. అప్పుడు అతడి వయసున్న 21 సంవత్సరాలు. ఆ సమయంలో వెన్నులో కణితి ఉన్నట్లు బయటపడింది. వైద్య పరీక్షలు చేయించగా.. ఈ కణితి హాడ్కిన్స్ లింఫోమా (hodgkin's lymphoma) వల్ల ఏర్పడిందని, ఇది ఓ రకమైన క్యాన్సర్ అని వైద్యులు తెలిపారు. తర్వాత పీటర్‌కి వైద్యులు కీమోథెరపీ (Chemotherapy) చేశారు. అయితే చికిత్సకు ముందు వైద్యులు పీటర్ స్పెర్మ్ నమూనాలను తీసుకుని భద్రపరిచారు. తర్వాత విడతలవారీగా మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు కీమోథెరపీ చేశారు. ఈ చికిత్స సాధారణంగానే రోగి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు.

ప్రేయసి ఇంటికి తమ్ముడిని పంపించిన అన్న.. కుటుంబ సభ్యులకు జ్యూస్ ఇచ్చిన కూతురు.. వేకువజాము లేచి చూస్తే..

ఇదిలావుండగా, కొన్నేళ్లుగా పీటర్.. ఆరెలిజా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు పిల్లలు కావాలనే కోరిక ఉండేది. కానీ క్యాన్సర్ చికిత్స కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే 26ఏళ్ల క్రితం తన స్పెర్మ్ శాంపిల్స్‌ని లండన్‌లోని (London) 'యూనివర్శిటీ కాలేజ్ హాస్పిటల్‌లో భద్రపరచిన విషయం పీటర్‌కు గుర్తుకువచ్చింది. అయితే వాటి జీవిత కాలం ఇన్నాళ్ల వరకు ఉంటుందా, లేదా అనే సందేహం ఉండేది. విషయం తెలుసుకోవాలని వైద్యులను సంప్రదించాడు. అప్పటి స్పెర్మ్ శాంపిల్స్ భద్రంగా ఉన్నాయని, ఐవీఎఫ్ టెక్నాలజీతో (IVF technology) బిడ్డను కనే వీలుందని వైద్యులు చెప్పారు. దీంతో ఈ చికిత్స కోసం రూ.28లక్షలు ఖర్చు చేశారు. ఎట్టకేలకు 26ఏళ్ల తర్వాత తండ్రి అయ్యే అవకాశం లభించడంతో పీటర్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..

Updated Date - 2022-10-27T18:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising