ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Army Job: నాలుగు నెలలుగా ఆర్మీలో పని చేస్తున్న యువకుడు.. తాజాగా బయటపడిన షాకింగ్ ట్విస్ట్..!

ABN, First Publish Date - 2022-11-23T18:32:38+05:30

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఆర్మీలో ఉద్యోగం సంపాదించానని పొంగిపోయాడు. ఐడీ, యూనిఫాం అందుకొని నాలుగు నెలలు ఆర్మీలో పనిచేశాడు. ఈ ఏడాది జులైలో విధుల్లో చేరి నెలకు రూ.12,500 చొప్పున జీతం కూడా అందుకున్నాడు. తాజాగా అసలు విషయం బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఆర్మీలో ఉద్యోగం సంపాదించానని పొంగిపోయాడు. ఐడీ, యూనిఫాం అందుకొని నాలుగు నెలలు ఆర్మీలో పనిచేశాడు. ఈ ఏడాది జులైలో విధుల్లో చేరి నెలకు రూ.12,500 చొప్పున జీతం కూడా అందుకున్నాడు. తాజాగా అసలు విషయం బయటపడింది. ఆ యువకుడకి అసలు ఆర్మీ ఉద్యోగమే రాలేదు. మాజీ సైనికుడు చేసిన స్కామ్‌లో ఇరుక్కుని మోసపోయాడు. తాజాగా ఆర్మీ జాబ్స్ స్కామ్ బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 20 ఏళ్ల మనోజ్‌ కుమార్ ఈ ఏడాది జులైలో 272 ట్రాన్సిట్ క్యాంప్‌లో 108 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీ 'మహర్'లో తనకు ఉద్యోగం వచ్చిందని అనుకున్నాడు. ఆర్మీ క్యాంపునకు వెళ్లి ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.12,500 చొప్పున జీతం అందుకుంటూ నాలుగు నెలలుగా అక్కడ పని చేస్తున్నాడు. అయితే తాజాగా అసలు విషయం బయటపడింది. మాజీ సైనికుడు అయిన రాహుల్ సింగ్.. మనోజ్ నుంచి రూ.16 లక్షలు తీసుకుని మోసం చేశాడని తేలింది. 2019లో ఆర్మీలో చేరిన రాహుల్ సింగ్ (25) ఆరోగ్య కారణాలతో కొన్ని రోజుల కిందట రాజీనామా చేశాడు. అయినా తాను ఆర్మీలో ఉన్నతాధికారినని నమ్మిస్తూ, ఉద్యోగాలిపిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

రాహుల్ సింగ్ ట్రాప్‌లో ఇరుక్కున్న మనోజ్ అతడికి రూ.16 లక్షలు ఇచ్చాడు. రిక్రూట్ అయినట్లు మనోజ్‌ కుమార్‌ను నమ్మించడానికి రాహుల్ పక్కా ఏర్పాట్లు చేశాడు. మనోజ్‌కు యూనిఫాం ఇచ్చి పఠాన్ కోట్‌లోని పోస్ట్‌కి పిలిచి, సెంట్రీ డ్యూటీని నిర్వహించడానికి అతనికి రైఫిల్‌ను అందజేశాడు. ఈ ప్రక్రియలో రాహుల్‌కు ఆర్మీ పోస్ట్ సిబ్బంది ఒకరు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే మనోజ్ ఇతర జవాన్లతో మాట్లాడినపుడు అసలు విషయం బయటపడింది. వారికి మనోజ్ తన అపాయింట్‌మెంట్ లెటర్, ఐడీ చూపినప్పుడు అవి నకిలీవని తేలింది. దీంతో అతను రాహుల్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాహుల్ సింగ్‌ను, అతడికి సహకరించిన మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-11-23T18:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising