ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bala Krishna: మిమ్మల్ని షోకు పిలవడమే తప్పు

ABN, First Publish Date - 2022-11-04T20:42:37+05:30

‘అన్‌స్టాపబుల్‌–2’ (Unstoppable2 With NBK )సీజన్‌ను మరింత క్రేజ్‌ తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). వారానికో సెలబ్రిటీతో సందడి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కు యువహీరోలు అడివి శేష్‌ (Adivi sesh), శర్వానంద్‌ (Sharwanand)గెస్ట్‌లుగా హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అన్‌స్టాపబుల్‌–2’ (Unstoppable2 With NBK )సీజన్‌ను మరింత క్రేజ్‌ తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). వారానికో సెలబ్రిటీతో సందడి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కు యువహీరోలు అడివి శేష్‌ (Adivi sesh), శర్వానంద్‌ (Sharwanand)గెస్ట్‌లుగా హాజరయ్యారు. షో మధ్యలో ఈ యువ హీరోలపై కామెంట్ల వర్షం కురిపించారు బాలయ్య. ప్రోమోలో శర్వానంద్‌, శేష్‌ డైలాగ్‌లకు ‘మీవన్ని బీ సెంటర్‌ మాటలు’ అంటూ పంచ్‌లు వేసిన బాలయ్య ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అని కూడా అన్నారు. ఆయన అలా కారణం ఉంది. గేమ్‌ కన్నా ముందు ఇద్దరు హీరోల అనుభవాలను పంచుకోమన్నారు. యాక్టింగ్‌ స్కిల్స్‌ను బట్టి హీరోలకు రేటింగ్‌ ఇవ్వాలని ‘బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ పేరు చెప్పారు. బాలయ్య.. దీనికి తల పట్టుకొని మహ్రాపభో అంటే సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు శర్వా, శేష్‌. తదుపరి గేమ్‌లోకి వెళ్లారు. శర్వానంద్‌, శేష్‌ను బాలయ్య ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ‘‘సినిమాల్లో ఎవరెవరికి ముద్దు పెట్టావ్‌? ఏ హీరోయిన్‌కు పెట్టాలనుకుంటున్నావ్‌? అని అడివి శేష్‌ను అడిగారు. ‘‘నేను మొదట అదాశర్మకు, తర్వాత మీనాక్షి చౌదరికి ముద్దు పెట్టా. ఎప్పటికైనా కత్రినా కైఫ్‌ను ముద్దు పెట్టుకోవాలనుంది’ అని శేష్‌ చెప్పారు. నీ ఫోన్‌లో ఆ వీడియోలు ఎన్ని ఉన్నాయ్‌? అని శర్వానంద్‌ని అడగ్గా ‘‘సర్‌.. మీ నాన్నగారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశారు. మీకు సంబంధించిన చాలా విషయాలు మా దగ్గరున్నాయి. ఇప్పుడు చెప్పమంటారా’’ అంటూ శర్వానంద్‌ అన్నారు. దాంతో, ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అంటూ  బాలకృష్ణ నవ్వులు పూయించారు. 

బ్రేకప్‌ చెప్పా...

‘‘నా చిన్నప్పుడు మీ సినిమాలోని ‘బీడీలు తాగండి బాబులు’, ‘ముద్దు పాప’ పాటలు పాడుతుంటే మా అమ్మ తలపై కొట్టింది. ఇప్పటికీ ఆ మచ్చ అలాగే ఉంది. నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడు శర్వానంద్‌ నాకు ఇన్స్‌పిరేషన్‌గా నిలిచాడు. మొదట్లో నాకు  ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. రచనపై ఇంట్రెస్ట్‌ ఉండటంతో నా సినిమాలకు నేనే కథలు రాసుకునేవాణ్ని. సినిమాల్లో వచ్చే అవకాశం అందరికీ దక్కదు. నా మొదటి చిత్రం కర్మ సిద్థాంతం నేపథ్యంలో తీశాను. దానికి ‘కర్మ’ అనే టైటిల్‌ పెట్టా. ప్రేక్షకులు దాన్ని తిట్టు అనుకుని సినిమా చూడలేదు. 16 ఏళ్ల వయసులో ‘బాయ్స్‌’ సినిమా ఆడిషన్‌ అవకాశం వచ్చింది. కానీ, వెళ్లలేదు. శంకర్‌గారి దర్శకత్వంలో నటించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. గతంలోనే నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నా. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవారి పెళ్లయ్యాకే మాలాంటి వాళ్లు చేసుకోవాలి. దానికి చాలా సమయం ఉందని రిలేషన్‌షిప్‌ను బ్రేక్‌ చేశా’’. 

రూపాయి తీసుకోకుండా వచ్చా

‘‘నాకు సినీ నేపథ్యం లేదు. నాన్న దగ్గర రూపాయి తీసుకోకుండా నా కాళ్లపై నేను నిలబడాలనుకున్న సమయంలో చిత్ర పరిశ్రమకు వచ్చా. హీరోగా నటించిన తొలి సినిమా ఆడలేదు. తర్వాత కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేశా. మంచి స్థాయికి వెళ్లాలనే నమ్మకంతో ఉన్నా. దర్శకుల చెప్పిన కథల్లో మంచివి ఎంపిక చేసుకుని చేస్తున్నా’’ అని శర్వానంద్‌ చెప్పారు. 


Updated Date - 2022-11-04T20:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising