Bad Boys Clubగా అన్ స్టాపబుల్.. అందుకేనా హీరోయిన్లు భయపడుతున్నారు?
ABN, First Publish Date - 2022-12-30T15:26:50+05:30
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు. హీరోయిన్లు ఎక్కువ ఎందుకు రావటం లేదు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. (But this show becomes mainly for boys) మొదటి సీజన్ అయిపోయింది, ఇప్పుడు రెండో సీజన్లో కూడా చాలా ఎపిసోడ్ లు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ షోకి ఎక్కువ హీరోలను పిలిచి…వాళ్ళనే ఎక్కువ ఇంటర్వ్యూ చేయిస్తున్నారు. మరి హీరోయిన్లు ఎందుకు రావటం లేదు? వాళ్ళని అసలు పిలుస్తున్నార, పిలిచినా వాళ్ళు రానని చెప్పారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే హోస్ట్ బాలకృష్ణ అడిగే ఇబ్బందికరమయిన ప్రశ్నలకి, బూతు డైలాగ్ ల కి హీరోయిన్లు భయపడి.. అనవసరంగా అందరి ముందు ఎందుకు అవమాన పడాలి అని ఈ షో కి దూరంగా వుంటున్నారని పరిశ్రమలో వినిపిస్తున్న టాక్. (Why the actresses are not coming to this show is the million dollar question)
అన్ స్టాపబుల్ షో అనేది పోను పోను ఒక బూతు పురాణంగా తయారయింది అనే డిస్కషన్ ఈ మధ్య సోషల్ మీడియా లో ఎక్కువ గా వినిపిస్తోంది. ఓ.టి.టి. కాబట్టి, దీనికి నియంత్రణ లేదు కాబట్టి, ఎటువంటి ప్రశ్నలు అయినా అడగవచ్చు, లేదా సమాధానాలు రాబట్టవచ్చు కాబట్టి వల్గరీటీ డోస్ బాగా పెంచేస్తున్నారా అనిపిస్తోంది. బూతులను అతి సాధారణంగా వాడేస్తున్నారు (This show becomes vulgar and witty with the kind of questions asked by the host). అందులోనూ నందమూరి బాలకృష్ణ అంటే ఎందుకో మొదటి నుండీ నటీమణులకు కొంచెం బెరుకు ఎక్కువే. అలాంటిది ఒక నియంత్రణ లేని ఓ.టి.టి లో అతను రెచ్చిపోయి ఏవో ప్రశ్నలు వేస్తే హీరోయిన్ లు సిగ్గుపడి అందరి ముందు అవమానపడటం ఇష్టం లేక రావటం లేదు అని కూడా పరిశ్రమలో ఇంకో టాక్ నడుస్తోంది.
ఫస్ట్ సీజన్ కాస్త పరవాలేదు బాలకృష్ణ ఇమేజ్ ని పెంచడానికి బాగా దోహదపడింది అని అనుకునేలోపే.. రెండవ సీజన్ మొదలవ్వడం, హీరోలను కూడా బాగా ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడగడం మనం చూస్తూనే వున్నాము. అలా ఎలా అడుగుతారు అని జనం ముక్కునవేలేసుకుంటున్నారు కూడా. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ (Prabhas episode) ఎపిసోడ్ లో కూడా 'శెట్టి' (Anushka Shetty) నా 'సనన్' (Kriti Sanon) నా అని హోస్ట్ ప్రభాస్ ని ఇబ్బంది పెట్టారు. ప్రభాస్ విషయం పక్కన పెడితే.. ఇక్కడ ఆ ఇద్దరు నటీమణులను అవసరం లేకపోయినా పబ్లిక్ గా డిస్కషన్ లో కి లాగరని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే శర్వానంద్, అడివి శేష్ ఎపిసోడ్ లో కూడా బూతు డోస్ బాగా ఎక్కువయింది. శర్వానంద్ మీరు 100 కి పైగా సినిమాలు చేసారు, కదా మరి హీరోయిన్స్ ని ఏమి చేయలేదా అని అడగటం... తరువాత బాలకృష్ణకి గిఫ్ట్ అంటూ రష్మిక మందన్న తో ఫోన్ .... అసలు ఈ షో ఎటువైపు పోతోందో కూడా జనాలకి అర్థం కావటం లేదు. జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరు నటులు వచ్చినప్పుడు కూడా బూతు పురాణం తారస్థాయికి చేరింది.
ఈ షో గురించి, హోస్ట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే, మాట్లాడితే అంత మంచిది. లేకపోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది అని ఫిల్మ్ నగర్ జనం అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ (Unstoppable) టీం అర్జెంట్ గా దృష్టి పెట్టి.. బూతు డోస్ తగ్గించి, హీరోయిన్ లను కూడా పిలిచి, జనం కొంచం చూడగలిగే ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని పరిశ్రమలో అనుకుంటున్నారు.
Updated Date - 2022-12-30T15:26:53+05:30 IST