ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వద్దంటున్నా.. అనవసరంగా వారితో పెట్టుకున్నాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-10-29T21:02:27+05:30

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సాత్నా పరిధి మైహార్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు (Prayagaj) చెందిన కొందరు హిజ్రాలు (Transgender) శుక్రవారం మైహార్ ప్రాంతానికి వచ్చారు. రాత్రి స్థానికంగా ఉన్న ఓ లాడ్డిలో బస చేశారు. తర్వాత రోడ్డు పైకి రావడంతో కొందరు యువకులు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిలో ఓ వ్యక్తి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్లపై వాహనాలను ఆపుతూ డబ్బులు రాబట్టుకునే సమయంలో హిజ్రాల పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అలాగే కొందరు హిజ్రాలు కూడా ఒక్కోసారి నానా బీభత్సం చేస్తుంటారు. చాలా మంది వారితో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సర్దుకుపోతుంటారు. అప్పుడప్పుడూ హిజ్రాలపై కొందరు దాడులు చేయడం, కొన్నిసార్లు హిజ్రాలే ఎదుటి వారిపై దాడులు చేయడం జరుగుతుంటుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వద్దు అని వారిస్తున్నా.. ఓ వ్యక్తి హిజ్రాల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ హేళన చేశాడు. దీంతో హిజ్రాలకు తిక్కరేగి.. అతన్ని రోడ్డుపై ఈడ్చుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

పాలు తాగుతున్న పసిబిడ్డను చెరువులోకి విసిరేసింది.. అంతటితో ఆగకుండా చివరకు..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సాత్నా పరిధి మైహార్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు (Prayagaj) చెందిన కొందరు హిజ్రాలు (Transgender) శుక్రవారం మైహార్ ప్రాంతానికి వచ్చారు. రాత్రి స్థానికంగా ఉన్న ఓ లాడ్డిలో బస చేశారు. తర్వాత రోడ్డు పైకి రావడంతో కొందరు యువకులు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిలో ఓ వ్యక్తి.. హిజ్రాలను పట్టుకుని లాగడంతో పాటూ అసభ్యపదజాలంతో దూహించాడు. గొడవలు వద్దంటూ హిజ్రాలు పలుమార్లు వారిని వారించారు. అయినా వినిపించుకోకుండా హేళన చేస్తుండడంతో చివరకు వారికి తీవ్రమైన కోపం వచ్చింది. వారిలో ఓ యువకుడిని పట్టుకుని రోడ్డు పైకి లాగారు. అనంతరం హిజ్రాలంతా ఒక్కసారిగా అతడిపై దాడికి దిగారు.

ఇంట్లో వారితో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది.. అమె చేసిన చిన్న పొరపాటుకు..

దీంతో పక్కనున్న యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. యువకుడిని రోడ్డు పైకి లాగిన హిజ్రాలు.. కిందపడేసి లాక్కుంటూ వెళ్లారు. ఒకరు కాలు పట్టుకుని లాగుతుండగా, మరో హిజ్రా స్టీలు పాత్రతో అతడిని చితబాదుతోంది. ఈ ఘటనతో స్థానికులంతా అక్కడ గుమికూడారు. అయినా విడిపించే ప్రయత్నం మాత్రం చేయలేకపోయారు. ఇలా చాలా సేపు అక్కడ హిజ్రాలు రచ్చరచ్చ చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకోగానే అంతా పారిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..

Updated Date - 2022-10-29T21:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising