Shocking: పాపం.. భార్య హత్య కేసులో 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన భర్త.. ఆరేళ్ల తర్వాత అందరికీ సూపర్ షాక్!
ABN, First Publish Date - 2022-12-12T20:29:47+05:30
ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం తన భార్యను హత్య చేశాడనే నేరంపై జైలుకు వెళ్లాడు.. అతడితో అతడి స్నేహితుడికి కూడా శిక్ష పడింది.. 18 నెలల జైలు శిక్ష తర్వాత ఇద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు.. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.. తాజాగా అతను మరో వ్యక్తితో ఉన్న తన భార్యను చూసి ఖంగుతిన్నాడు..
ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం తన భార్యను హత్య చేశాడనే నేరంపై జైలుకు వెళ్లాడు.. అతడితో పాటు అతడి స్నేహితుడికి కూడా శిక్ష పడింది (Husband Jailed for wife`s murder).. 18 నెలల జైలు శిక్ష తర్వాత ఇద్దరూ బెయిల్పై బయటకు వచ్చారు.. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.. తాజాగా అతను మరో వ్యక్తితో ఉన్న తన భార్యను చూసి ఖంగుతిన్నాడు.. వెంటనే కోర్టుకు సమాచారం అందించాడు.. షాకైన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కరౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఆర్తీ దేవీ (26), సోనూ కుమార్ (32) 2015లో పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆర్తీ దేవి అదృశ్యమైంది. ఆమె కోసం సోనూ ఎంతగానో వెతికాడు. ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని చూపించి.. ఆర్తీని తన అల్లుడు, అతని స్నేహితుడు కలిసి హత్య చేసినట్లు ఆర్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనూను, అతడి స్నేహితుడు గోపాల్ను అరెస్ట్ చేశారు. గోపాల్ 9 నెలలు, సోనూ 18 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.
ఇటీవల మధురలో ఆర్తీ దేవిని వేరే వ్యక్తితో చూసి సోనూ నివ్వెరపోయాడు. వెంటనే పోలీసులకు, కోర్టుకు సమాచారం అందించాడు. సోనూ దగ్గర నుంచి వెళ్లిపోయిన ఆర్తి తన పేరు, పుట్టిన తేదీ మార్చుకుని కొత్త ఆధార్ కార్డు సంపాదించి మరో వ్యక్తిని (Dead woman found living with second husband) పెళ్లి చేసుకుంది. ఆదివారం ఆర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2022-12-12T20:53:03+05:30 IST