Hyderabad Book Fair: సమస్యలపై అవగాహన కల్పించడంలో సాహిత్యం పాత్ర అద్భుతం..!
ABN, First Publish Date - 2022-12-23T13:32:33+05:30
జాతీయ పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది.
జాతీయ పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజ, సర్వీసులు, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
మహిళా భద్రతా విభాగాన్ని సుమతి, ఐపిఎస్, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల శక్తి పెరుగుతుంది.. సమాజంలోని సమస్యలను అన్ని కోణాల్లో సృజిస్తూ తమ రచనల ద్వారా మంచి పరిష్కారాలను సూచించే మహిళా రచయితల సంఖ్య పెరగడం అభినందనీయమని సుమతి, ఐపిఎస్ అన్నారు. సమస్యలపై అవగాహన కల్పించడంలో సాహిత్యం అధ్బుతమైన పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ పుస్తక ప్రదర్శనలో అనేక పుస్తకాలు విద్యార్థులకు, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి పోటీ పరీక్షల వరకూ ఇక్కడ దొరుకుతాయి. ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రముఖులు అభిప్రాయ పడ్డారు.
Updated Date - 2022-12-23T14:24:26+05:30 IST