ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Book Exhibition : కొంచెం నిప్పు- కొంచెం నీరు పుస్తకావిష్కరణ చేసిన ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా..!

ABN, First Publish Date - 2022-12-25T20:08:19+05:30

ఈ రచనలు అటు పాఠకుడిని ఇటు సమాజాన్ని చేరి ఆలోచింపజేసేవిగా ఉంటాయి.

Hyderabad Book Fair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరణ్యకృష్ట రచించిన కొంచెం నిప్పు-కొంచెం నీరు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత  ఓల్గా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి ప్రోఫెసర్.జి. హరగోపాల్,  ఆత్మీయ అతిథులు కె.సజయ, తేళ్ల అరుణ పాల్గొన్నారు.

సందేశాత్మకంగా రాసినా, ప్రయోజనాత్మకంగా ఒక్కో వ్యాసాన్ని తయారు చేసి నిర్మొహమాటంగా చెప్పవలసిన విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నించారు అరణ్యకృష్ణ. ఈ రచనలు అటు పాఠకుడిని ఇటు సమాజాన్ని చేరి ఆలోచింపజేసేవిగా ఉంటాయి. రచనలోని నిక్కచ్చితనం కొందరిని నొచ్చుకునేలా చేసినా చాలావరకూ అంగీకరించకతప్పని విషయాలు ఇందులో చాలా ఉంటాయి.

ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దేశంలోని స్త్రీలు పడుతున్న భాధలు, వారి సమస్యలపై రచయిత అరణ్యకృష్ట చక్కగా తన రచనలో స్పష్టం చేశారని అన్నారు. ప్రతి కుల హత్య వెనుక పరువు ఉంటుందని, ప్రతి పరువు వెనుక జెండర్ రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని రచయిత చక్కగా విషయపరిచారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రోఫెసర్.జి. హరగోపాల్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దేశంలో జరిగే సామాజిక సాంస్కృతిక రాజకీయలపై అరణ్య కృష్ట చేసిన ప్రయాత్నం గొప్ప అంశంమని చెప్పారు. దేశంలో ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులను అరణ్య కృష్ణ తన రచనల ద్వారా తెల్పడం ఇప్పుడు చాలా అవసరమని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత సజయ కేంద్రరాష్ట్రాల్లో ప్రశ్నించే మనుషుల పట్ల పాలక వర్గాలు అనుసరించే విధానాలు ఆందోళన కల్గిస్తున్నాయని చెప్పారు. అరణ్య కృష్ట చేసే ప్రయాత్నం ఇప్పటి సమాడానికి ఎంతైనా అవసరమని చెప్పారు.

 

Updated Date - 2022-12-25T20:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising