ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Book Fair: పుస్తక పఠనం నిర్మాణాత్మకంగా కొనసాగాలి..  

ABN, First Publish Date - 2022-12-26T18:36:12+05:30

మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పుస్తకాలు చదవడం ఎంతో అవసరం

Hyderabad Book Fair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువన్నారు. అద్వానీ తన  ప్రయాణంలో కూడా పుస్తకాలు చదువేవారన్నారు. పుస్తకాలు విజ్ఞానానికి, వికాసాన్ని పెంచేది లాగా ఉండాలన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి మోరల్ సపోర్ట్ గా పుస్తక పఠనం చాలా అవసరమని చెప్పారు.  నేటి యువత ఆవేశ నిర్ణయాలు తీసుకోకుండా, వక్రమార్గంలో పడకుండ ఉండేందుకు పుస్తక పఠనం చాలా దోదహపడుతుందన్నారు.

రామాయణం, మహాభారతాలు మనవారికి మార్గదర్శకాలు కావాలని, అవి పంచే గొప్ప సందేశాలను అచరణలో పెడితే గొప్ప పౌరులుగా ఆదర్శవంతులుగా తయారవుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విషయంగా తనను విజయరామారావు భాగవతం చదవమన్నారని ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పుస్తకాలు చదవడం ఎంతో అవసరం జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు చెదరకుండా ఉండే మనో ధైర్యాన్ని పఠనంతోనే పొందవచ్చని ఆయన తెలిపారు.

నేటి సమాజానికి  గ్రంథాలయాలు చాలా అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు దత్తత్రేయ. బుక్ ఫెయిర్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్,మన ముఖ్యమంత్రి స్టాల్ తోపాటు ప్రభుత్వ స్టాల్స్, ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయా చంద్రమోహన్ స్టాల్స్ ను పరిచయం చేశారు.

Updated Date - 2022-12-26T18:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising