International Human Rights Day: హక్కును సాధించుకునే హక్కు ప్రతి ఒక్కరిదీ..!
ABN, First Publish Date - 2022-12-10T13:19:31+05:30
మానవులతో పాటు జంతువులకు కూడా హక్కులు కావాలి
ఈ నేలపై జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జరిగిన అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడే హక్కు కూడా ప్రతి ఒక్కరికీ ఉంది. వాటిని సాధించుకోనే హక్కు కూడా అందిరికీ ఉంది. మానవులతో పాటు జంతువులకు కూడా హక్కులు కావాలని వాటి సాధనకు కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎవరికి ఎటువంటి హక్కులు కల్పించారో తెలుసుకుందాం.
1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. హక్కులు అందరికీ అవసరమే. మహిళలకు, దివ్యాంగులకు, బాలలకు, పర్యావరణానికి, జంతువులకు కూడా హక్కులు అవసరమే. అవి అమలు అయ్యే విధంగా అందరం శ్రమించాలి.
దివ్యాంగుల హక్కులు(Rights of the disabled).. అవయవ లోపం ఒక్కటే వీరిని మామూలు మనుషుల నుంచి వేరు చేసి చూడకూడదు. వారికి ఉన్న వెసులుబాటులో అభివృద్ధి పధంలో ముందంజలో ఉండాలి. అవమానాలు, చులకన భావం వీరి పట్ల చూపరాదు, దివ్యాంగులకు ఉండవలసిన హక్కులు ఇవే.
1. దివ్యాంగులు మానసికంగా అవయవ లోపం ఉన్నవారికి కూడా హక్కులు ఉంటాయి. అవేంటంటే..
యినైటెడ్ నేషన్స్ కన్వెనషన్ ఫర్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (యూఎన్సీఆర్పీడీ)
2. దివ్యాంగుల విషయంలో ఏ రకమైన వివక్ష లేకుండా ఉండటం.
3. సమాజంలో ప్రతీ సమాన అవకాశాలు కలిగించడం.
4. వికాలాంగులలో ఉన్న తేడాలను గుర్తించి, గౌరవించడం.
5. పురుషులూ, మహిళల మధ్య సమానత్వం.
6. స్పెషల్ చిల్డ్రన్/చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ లో అంకురిస్తున్న విభిన్న ప్రతిభను గుర్తించి, గౌరవించి వారు స్పెషల్ కెపాసిటీలతో ఎదిగేందుకు దోహదం చేయటం.
బాలల హక్కులు(Children's rights)..
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి బాలల హక్కులు ఏవి.
జీవన హక్కు, అభివృద్ధి హక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు.
బాలలకు న్యాయాన్ని కల్పించడం, నిర్లక్ష్యానికి గురైన బాలలు, గనులలో, వెట్టి చాకిరీ చేస్తన్న వారిని కాపాడి, విద్యను అందివ్వడం వంటివి. ప్రత్యేక బాలల పట్ల శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను రూపు మాపే దిశగా కృషి చేయడం. పిల్లల పరమైన చట్టాల గురించిన అవగాహన అందరిలోనూ ఉండాలి.
మహిళా హక్కులు(Women's rights)..
భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కుల్ని కల్పించింది. వాటిలో 12 హక్కులు ప్రధానమైనవి. స్త్రీకి విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ అవసరం, వాటితో పాటు మగవారితో సమానమైన అన్ని హక్కులు స్త్రీలకు ఉండాలి. వీటిలో కొన్ని తీసుకుంటే..
1. వారసత్వ సమాన వాటా హక్కు
2. భ్రూణ హత్యల నిరోధక హక్కు
3. గృహ హింస నిరోధక హక్కు
4. ప్రసూతి ప్రయోజనాల హ్కక్కు
5. న్యాయ సహాయ హక్కు.
6. గోప్యత హక్కు
7. ఆన్ లైన్ లో ఫిర్యాదుల హక్కు
జంతువుల హక్కులు(Animal rights)
జంతు హక్కుల కార్యకర్తలు జంతువులకు హక్కులను కల్పించాలని పోరాడుతున్నారు.
జంతువులకు హక్కులు అవసరమే. వాటిని శారీరకంగా బాధించడం, అవమానించడం, వాటి బొచ్చు, మాంసం అక్రమంగా విక్రయించడం, సర్కస్ లో ఆడించడం సమస్యగా మారుతుంది. జంతువుల దోపిడీని నివారించే విధంగా చర్యలు తీసుకోడానికి వాటి కూడా హక్కులు అవసరం.
పర్యావరణం హక్కులు(Environmental rights)..
ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం శ్రమించాలి. పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు కృషి చేయడం అవసరం ఉంది. ఫ్లాస్టిక్ ను నివారించాలి, గాలి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలలో శ్రద్ధతీసుకోవడం అవసరం. మన పరిశరాలను, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైనా ఉంది.
Updated Date - 2022-12-10T13:42:39+05:30 IST