ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dual Sim Cards: ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా..?

ABN, First Publish Date - 2022-11-26T18:23:11+05:30

ఎప్పుడైతే డ్యూయల్ సిమ్ ఫోన్లు (Dual SIM phones) అందుబాటులోకి వచ్చాయో.. ప్రతి ఒక్కరూ రెండు సిమ్‌లను వాడటం అలవాటుగా మార్చుకున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లలోనూ డ్యూయల్ సిమ్ సిస్టమ్ అందుబాటులో ఉండడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడైతే డ్యూయల్ సిమ్ ఫోన్లు (Dual SIM phones) అందుబాటులోకి వచ్చాయో.. ప్రతి ఒక్కరూ రెండు సిమ్‌లను వాడటం అలవాటుగా మార్చుకున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లలోనూ డ్యూయల్ సిమ్ సిస్టమ్ అందుబాటులో ఉండడంతో వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీ సిమ్‌లను ఎంచుకుంటున్నారు. నెట్‌‌వర్క్ బాగున్న సిమ్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా కంపెనీ సిమ్‌లను సెకండరీ ఆప్షన్‌లా ఉంచుకుంటున్నారు. అయితే ఇక మీద ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా.. అన్న ప్రశ్నకు అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి...

వైద్య విద్యకు మధ్యలోనే పులుస్టాప్.. UPSC ఫలితాల్లో నాలుగో ర్యాంక్.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదీ..!

ఒకప్పుడు రెండో సిమ్‌ యాక్టివ్‌లో ఉండేందుకు ఎలాంటి రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. అయితే తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాను రాను టెలికాం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా కనీస రీచార్జ్‌ నిబంధనను విధించాయి. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ (Recharge plans) ధరలను అమాంతం పెంచేశాయి. ఈ ఏడాది కూడా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ (AirTe) lకనీస రీచార్జ్ రూ.79ని గత ఏడాది రూ.99కి పెంచింది. తర్వాత ఎయిర్‌టెల్ ‌‌ పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద కొన్ని సర్కిళ్లలో తమ ప్రీపెయిడ్‌ బేస్‌‌‌‌ టారిఫ్‌‌‌‌ను రూ.99 నుంచి రూ.155 కి పెంచింది. దీనిపై స్పందన చూసి మిగతా సర్కిళ్లలోనూ టారిఫ్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.

Viral photos: రన్నింగ్ ట్రైన్‌లో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా మీకంట పడ్డాయా.. అద్భతం అంటున్న నెటిజన్లు..

5G సేవలు ప్రారంభించిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్‌లను మరింతగా పెంచేశాయి. దీంతో రెండు సిమ్‌లను వాడడం.. వినియోగదారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం దాదాపు అన్ని అన్ని టెలికాం కంపెనీలు ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఒకే సిమ్‌ను వాడేందుకే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టెల్కోలు సుమారు 70లక్షల మంది వినియోగదారులను దూరం చేసుకున్నాయి. ఇందులో ఎక్కువ శాతం వొడాఫోన్-ఐడియా (వీఐ) వినియోగదారులు ఉండగా, తర్వాత స్థానంలో భారతీ ఎయిర్ టెల్ నిలిచింది. సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. త్వరలో ఈ డ్యూయల్ సిమ్ ట్రెండ్‌కు శుభం కార్డు పడనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ దొంగల తెలివి చూస్తే వామ్మో!.. అంటారు.. సొరంగం తవ్వి మరీ..‌ ఏకంగా రైలు ఇంజిన్‌నే..

Updated Date - 2022-11-26T18:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising