ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదికి రూ.15 లక్షల జీతాన్నిస్తున్న జాబ్‌కు రిజైన్ చేస్తే అంతా నవ్వారు.. ఇప్పుడు నెలకు రూ.15 లక్షల సంపాదన..!

ABN, First Publish Date - 2022-05-20T20:50:15+05:30

అతను ఓ మల్టీ నేషనల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ స్థాయి ఉద్యోగి.. ఏడాదికి రూ.15 లక్షలు జీతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ మల్టీ నేషనల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ స్థాయి ఉద్యోగి.. ఏడాదికి రూ.15 లక్షలు జీతం.. అలాంటి ఉద్యోగాన్ని వదులుకుని అతను వ్యవసాయంలోకి దిగాడు.. అతడి నిర్ణయాన్ని అందరూ తప్పుపట్టారు.. తెలివి తక్కువ పని అన్నారు.. అయితే ప్రస్తుతం అతను సంపాదిస్తున్న లాభాలను చూసి షాకవుతున్నారు.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ ముఖాటి ప్రస్తుతం తనకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.1.50 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. 

ఇది కూడా చదవండి..

కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేశానన్న 22 ఏళ్ల యువతి.. ఆమె కథంతా విని..



వ్యవసాయం కూడా లాభసాటి వ్యాపారమే అని ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చాలా మంది రైతులు నిరూపిస్తున్నారు. వారిలో అనిల్ ఒకరు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం ప్రారంభించిన అనిల్ ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనిల్ తనకున్న ఐదెకరాల్లో మిరప నారు వేశాడు. దాదాపు కోటి మిరప మొక్కలను 45 రోజుల్లో సిద్ధం చేసి వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుంటాడు. అగ్రికల్చర్ డిగ్రీ చదవిన అనిల్‌ నాణ్యమైన విత్తనాలను కొని నారు వేస్తుంటాడు. 45 రోజుల పాటు జాగ్రత్తగా పని చేసి దాదాపు కోటి మిరప మొక్కలను సిద్ధం చేస్తాడు. తర్వాతి 15 రోజుల్లో ఆ మొక్కలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుంటాడు. 


ఒక్కో మొక్కను రూ.1.70కు అమ్ముతుంటాడు. ఒక్కో మొక్కపై అనిల్‌కు 30 పైసలు లాభం వస్తుంది. కోటి మొక్కలకు గానూ రూ.30 లక్షలు సంపాదిస్తాడు. కేవలం రెండు నెలల్లోనే అనిల్ ఈ లాభం అందుకుంటాడు. ఒకప్పుడు మేనేజర్‌గా పని చేసిన అనిల్ సంస్థలో ఇప్పుడు ముగ్గురు మేనేజర్లు, 35 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంని, ప్రత్యేకంగా నిర్మించిన పాలీ హౌస్‌లో అనిల్ ఆ మొక్కలను పెంచుతుంటాడు.     



Updated Date - 2022-05-20T20:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising