ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Megastar Chiranjeevi: కైకాల నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు

ABN, First Publish Date - 2022-12-23T10:47:29+05:30

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు.

Kaikala
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆ ట్వీట్‌లో చిరంజీవి కైకాల ఇంట్లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, ఆయనతో కేక్ కట్ చేయించిన పిక్స్‌ని షేర్ చేశారు. అలాగే కైకాల ప్రస్థానం, నటనా కౌశల్యం, ఆయనతో తనకున్న బంధాన్ని తెలుపుతూ ఓ ప్రకటనని కూడా జోడించారు. అందులో.. ‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సౌర్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యనారాయణ తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ కైకాల సత్యనారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.

శ్రీ కైకాల సత్యనారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటన వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం కలిగింది. ఆయన అరుదైన నటులు, డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన మనిషి. నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని అందులో ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-12-23T12:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising