అర్ధరాత్రి పహారా కాస్తున్న జవాను.. రోడ్డు పక్కన పడుకున్న వారిని పరిశీలించి.. చివరకు..
ABN, First Publish Date - 2022-12-18T17:39:18+05:30
కంచే చేను మేసిన చందంగా.. కొన్నిసార్లు రక్షణగా ఉన్న వారే చివరకు భక్షణ చేసే ఉదంతాలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో..
కంచే చేను మేసిన చందంగా.. కొన్నిసార్లు రక్షణగా ఉన్న వారే చివరకు భక్షణ చేసే ఉదంతాలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చోరీలను అరికట్టేందుకు జవాన్లను నియమించారు. అయితే అర్ధరాత్రి పహారా కాస్తున్న వారు రోడ్డు పక్కన నిద్రపోతున్న వారిని, చిన్న చిన్న దుకాణాలను టార్గెట్ చేశారు. చివరకు వారి నిర్వాకం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ఖుషినగర్ జిల్లా తుర్కపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల స్థానికంగా చోరీలు విపరీతంగా జరుగుతుండేవి. వీటిని అరికట్టేందుకు రాత్రి వేళల్లో పహారా కాసేందుకు ఇద్దరు జవాన్లను నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చోరీలను అరికట్టాల్సిన జవాన్లు (Jawans).. తామే దొంగలుగా మారారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన వారిని గమనిస్తూ ఉండేవారు. ఆదమరచి నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసి చోరీలకు (theft) పాల్పడడం మొదలెట్టారు.
ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి.. పోలీసులను ఆ వరుడు వేడుకున్నా..
ఇటీవల ఓ జవాను చోరీకి పాల్పడిన వీడియో వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న జవాను.. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని గమనించాడు. దుప్పటి పైకెత్తి లోపల ఉన్న ఓ మూటను తీసుకుని, అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో వైరల్ అవడంతో జవాన్ల చోరీ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు జవాన్లపై కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Updated Date - 2022-12-18T17:44:18+05:30 IST