ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లల్లో కారం కొట్టి డబ్బులు దోచుకెళ్లారని ఫిర్యాదు.. చివరకు సీసీ కెమెరాలు చూసి ఖంగుతిన్న పోలీసులు..

ABN, First Publish Date - 2022-12-07T16:46:58+05:30

పోలీసులు రోజూ వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు అందుతుంటాయి. వీటిలో కొన్నిసార్లు వీటిలో కొన్ని కేసులు పెద్ద సమస్యగా మారుతుంటాయి. మరికొన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులు రోజూ వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు అందుతుంటాయి. వీటిలో కొన్నిసార్లు వీటిలో కొన్ని కేసులు పెద్ద సమస్యగా మారుతుంటాయి. మరికొన్ని కేసులు.. ప్రజలతో పాటూ పోలీసులను కూడా షాక్‌కు గురి చేస్తుంటాయి. రాజస్థాన్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కళ్లల్లో కారం కొట్టి డబ్బులు దోచుకెళ్లారని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. చివరకు షాక్‌ అయ్యారు. నిందితుడి తెలివితేటలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే..

మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని.. ఫోన్ చేసిన వ్యక్తి.. తీరా అక్కడికి వెళ్లగా.. స్కూటీలో వచ్చిన యువతి సడన్‌గా..

రాజస్థాన్ (Rajasthan) బికనీర్ పరిధి శ్రీదున్‌గర్‌గఢ్ ప్రాంతానికి చెందిన భగీరథ్‌నాథ్ అనే వ్యక్తి వివిధ రకాల వ్యాపారాలు చేసేవాడు. ఈ క్రమంలో ఇటీవల భారీ స్థాయిలో అప్పులు (Debts) చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎలా తీర్చాలో తెలీక తీవ్రమానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యాడు. చివరకు అతడికి ఓ ఐడియా వచ్చింది. మంగళవారం తన కారులో బయటికి వెళ్లాడు. తనకు తానే కళ్లల్లో కారం చల్లుకుని.. అరుపులు, కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు పరుగుపరుగున అక్కడికి వెళ్లారు.

వివాహితకు ఫోన్‌లో పరిచయమైన యువకుడు.. ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించకపోవడంతో.. ఆస్పత్రికి ఫోన్ చేసి..

గుర్తు తెలియని దుండగులు.. కళ్లల్లో కారం పొట్టి లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని చెప్పాడు. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలం, చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. అయితే ఎక్కడా దుండగులు నగదును దోచుకున్న ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వ్యాపారిని.. తమదైన స్టైల్లో విచారించారు. దీంతో చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..

Updated Date - 2022-12-07T16:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising