Ram Gopal Varma: 70 ముక్కలుగా నరికే అవకాశం ఇవ్వు దేవుడా.. ట్వీట్ వైరల్

ABN, First Publish Date - 2022-11-17T12:51:54+05:30

ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని ఓ దుర్మార్గుడు హత్య చేసిన సంఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

Ram Gopal Varma: 70 ముక్కలుగా నరికే అవకాశం ఇవ్వు దేవుడా..  ట్వీట్ వైరల్
Ram gopal Varma
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని ఓ దుర్మార్గుడు హత్య చేసిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చంపడమే కాకుండా ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికి అర్థరాత్రులు వాటిని నిర్మానుష ప్రదేశాల్లో పడేశాడు. ఈ విషయం తెలిసి జనాల వెన్నులో వణుకు పుట్టింది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ సంఘటన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది.

ఈ తరుణంలోనే ఈ ఘటనపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఆ యువతి హత్యని ప్రస్తావిస్తూ.. ఆమె ఆత్మగా వచ్చి ప్రతికారం తీర్చుకోవాలని కోరాడు. దానికోసం ఆమెకి బలం ఇవ్వాలని డైరెక్ట్‌గా దేవుడికి రిక్వెస్ట్ చేశాడు. చట్టాలు నేరాలను కంట్రోల్ చేయలేవని, ఆత్మలు చేయగలవని రెండు ట్వీట్లు చేశాడు. ఆర్జీవీ చేసిన మొదటి ట్వీట్‌లో.. ‘ఆమె స్వర్గంలో శాంతంగా ఉండే బదులు.. ఆమె ఆత్మ వెనక్కి రావాలి. అతన్ని 70 ముక్కలుగా నరికేయాలి’ అని రాసుకొచ్చాడు.

మరో ట్వీట్‌లో.. ‘ఇలాంటి భయంకరమైన హత్యలను చట్టాల భయం నియత్రించలేదు. దానికి బదులు చనిపోయిన వారి ఆత్మలు వెనక్కి వచ్చి.. తమని చంపిన వారిని చంపితే మాత్రం ఈ దారుణాలు కచ్చితంగా ఆగిపోతాయి. అందుకే నా ఈ అభ్యర్థనని దేవుడు మన్నించి, అవసరమైన పని చేయాలని కోరుకుంటున్నా’ అని రాశాడు. ఆర్జీవీ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాంతో.. ‘ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకుంటున్నావా?’, ‘ఎప్పుడు ప్రారంభిస్తున్నావు?’, ‘నువ్వు దేవుడ్ని నమ్మవు కదా?’ అని ఎంతోమంది నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-11-17T12:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising