ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PhonePe, Google Pay ద్వారా పొరపాటున వేరేవాళ్లకు పంపిన డబ్బులు వెనక్కు తెప్పించాలంటే..

ABN, First Publish Date - 2022-12-09T16:22:20+05:30

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే.. వీటి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మూరు మూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే.. వీటి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మూరు మూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకూ నగదు రహిత లావీదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీన్ని అనుసరించే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌ల వరకూ అన్నింట్లోనూ ఎక్కువగా డిజిటల్ చెల్లింపులే (Digital payments) జరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రూపాయి నుంచి లక్ష వరకూ PhonePe, Google Pay ద్వారా పంపించే అవకాశం వచ్చింది. అయితే ఇందులో అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఒకరికి పంపాల్సిన నగదును మరొకరికి పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తెగ గాబరాపడిపోతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్‌బీఐ (RBI) చర్యలు తీసుకుంది.

Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..

యూపీఐ (Unified Payments Interface) ద్వారా జరిపే నగదు లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగవు. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి నగదు వెళ్లకపోయినా.. రోజుల వ్యవధిలోనే మళ్లీ పంపినవారికి రీఫండ్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఒక స్కానర్ కోడ్‌కు బదులు.. ఇంకోటి స్కాన్ చేయడం, ఒకరి యూపీఐకి బదులుగా.. ఇంకో యూపీఐకి నగదు పంపుతుంటారు. అప్పుడు నష్టపోయిన వ్యక్తి నగదును తిరిగి పొందేలా ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది.

55 ఏళ్ల ఉపాధ్యాయుడి బ్యాంక్ అకౌంట్లో రూ.21.53 లక్షలు మటాష్.. ఆయన చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..

అయితే ఇందుకోసం నష్టపోయిన వ్యక్తి, ముందుగా లావాదేవీలు జరిపిన.. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వ్యవస్థలకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ (Customer service) ద్వారా సాయం తీసుకోవచ్చు. ఇలా చేస్తే దాదాపుగా సమస్య పరిష్కారం అవుతుంది. అయితే అప్పటికీ నగదు రీఫండ్ (Cash refund) కాకపోయినా భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్‌బీఐ.. అంబుడ్స్‌మన్ (Ombudsman) అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ తదితర మార్గాల ద్వారా జరిపే లావాదేవీల్లో సమస్య ఎదరురైన సందర్భంలో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

కళాశాల వద్ద అదే పనిగా తిరుగుతున్న యువకులు.. అనుమానం వచ్చి బ్యాగుల్లో తనిఖీ చేయగా..

Updated Date - 2022-12-09T16:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising