ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revenge on parents: చిన్నప్పుడు హాస్టల్లో చేర్పించారని 40 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులపై పగ తీర్చుకున్న కొడుకు..

ABN, First Publish Date - 2022-12-14T20:25:21+05:30

తనను చిన్నప్పుడు బలవంతంగా హాస్టల్‌లో చేర్పించారనే కారణంతో తల్లిదండ్రులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల తర్వాత వారిపై పగ తీర్చుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ దారుణంగా హింసించాడు. తీవ్ర గాయాల పాలైన తల్లిదండ్రులు హాస్పిటల్‌లో పది రోజుల పాటు చికిత్స అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనను చిన్నప్పుడు బలవంతంగా హాస్టల్‌లో చేర్పించారనే కారణంతో తల్లిదండ్రులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల తర్వాత వారిపై పగ (Revenge on parents) తీర్చుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ దారుణంగా హింసించాడు. తీవ్ర గాయాల పాలైన తల్లిదండ్రులు హాస్పిటల్‌లో పది రోజుల పాటు చికిత్స అందుకున్నారు. బ్రిటన్‌కు (Britain) చెందిన ఎడ్ లిన్సే(51) అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రి నికోలస్ క్లేటన్ (85), తల్లి జూలియా (82) పై దాడి చేశాడు. కోర్టులో విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

చెషైర్‌లోని తమ ఫామ్‌హౌస్‌లో ఉన్న తల్లిదండ్రులపై ఈ ఏడాది ఏప్రిల్‌లో లిన్సే దాడి చేశాడు. ఆ దాడిలో తండ్రి క్లేటన్ తలకు తీవ్ర గాయమైంది. మెదడులో రక్తస్రావం మొదలైంది. క్లేటన్ ఇప్పటికీ ఆ గాయం నుంచి కోలుకోలేదు. ఇక, తల్లి భుజం, వీపుపై గాయలయ్యాయి. పోలీసులు లిన్సేను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో లిన్సే తల్లిదండ్రులపై తను ఎందుకు దాడి చేశాడో వివరించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో తనకు సంబంధాలు లేవని, 40 ఏళ్ల క్రితం తనను బలవంతంగా బోర్డింగ్ స్కూల్‌కు పంపేశారని, ఎప్పుడూ చూడడానికి కూడా వచ్చే వారు కాదని, వారు తనకు ఎప్పుడూ అండగా నిలవలేదని కోర్టులో లిన్సే చెప్పాడు.

కాగా, లిన్సే బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నట్టు పరిశోధనలో వెల్లడైంది. అతను మానిక్ సైకోసిస్తో బాధపడుతున్నాడని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు చెబుతూ లిన్సే జైలు నుంచి విడుదలయ్యే వరకు మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు.

Updated Date - 2022-12-14T20:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising