రైల్లో వెళ్తున్నాడో వ్యక్తి.. స్కూల్‌లో ఉండాల్సిన పక్కింటి పిల్లాడు బోగీలో ప్రత్యక్ష్యం.. ఆరా తీస్తే కంగారు పడుతూనే..
ABN, First Publish Date - 2022-12-08T18:36:24+05:30
కొన్ని పిల్లలు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న కారణాలకు భయపడిపోయి.. చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ బాలుడు..
కొన్ని పిల్లలు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న కారణాలకు భయపడిపోయి.. చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ బాలుడు ఇలాగే చేశాడు. రైల్లో వెళ్తున్న ఓ వ్యక్తికి.. బోగీలో తన పక్కింటి పిల్లాడు కనిపించాడు. తన వెంట ఎవరూ లేకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. అతడి వద్దకు వెళ్లి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా బాలుడు కంగారుపడ్డాడు. చివరకు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చింద్వారాలోని జున్నార్డియో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహ్మద్ అనాస్ అనే విద్యార్థి (student) 12వ తరగతి చదువుతున్నాడు. ఇదిలావుండగా, సోమవారం బాలుడి పక్కింటికి చెందిన వ్యక్తి.. చింద్వారా వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా బాలుడు కంటపడ్డాడు. ఎక్కడి వెళ్తున్నావని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తాను పాఠశాల వద్ద బాత్‌రూంకు వెళ్తుండగా.. ఇద్దరు యువకులు నోరు మూసి కిడ్నాప్ చేశారని చెప్పాడు.
బంధువులతో ఆనందంగా ఫొటోలు దిగుతున్న వధూవరులు.. సడన్‌గా తుపాకీ తూటాల మోత.. చివరకు చూస్తే..
తనను బేతుల్ తీసుకెళ్తేందుకు స్టేషన్‌కి తీసుకెళ్లగా.. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని చింద్వారా రైలు ఎక్కినట్లు చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి.. బాలుడి కుటుంబ సభ్యులు, పోలీసులకు విషయం తెలియజేశాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విద్యార్థిని కిడ్నాప్ చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో అతన్ని లోతుగా విచారించగా అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తనకు ఇచ్చిన హోం చేయలేదని, టీచర్లు తిడతారనే భయంతో కావాలనే కిడ్నాప్ డ్రామా (Kidnapping drama) ఆడినట్లు అంగీకరించాడు. దీంతో చివరకు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..
Updated Date - 2022-12-08T18:36:29+05:30 IST