Mahesh Babu: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో అదే గొప్పది!

ABN, First Publish Date - 2022-11-27T18:08:37+05:30

సూపర్‌స్టార్‌ కృష్ణ కృష్ణ (Super star krishna)దశ దిన కర్మ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నానక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహంలో పెద కర్మ కార్యక్రమాలు పూర్తి చేసిన మహేశ్‌ తదుపరి సినీ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌, అభిమానుల కోసం జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Mahesh Babu: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో అదే గొప్పది!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌స్టార్‌ కృష్ణ కృష్ణ (Super star krishna)దశ దిన కర్మ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నానక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహంలో పెద కర్మ (Krishna 11th Day Ceremony)కార్యక్రమాలు పూర్తి చేసిన మహేశ్‌ mahesh emotional speech(తదుపరి సినీ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌, అభిమానుల కోసం జెఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని సూపర్‌స్టార్‌ ఫొటోకు శ్రద్ధాంజలి ఘటించారు. అభిమానుల కోసం జెఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రత్యేకంగా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉన్నారో అచ్చం అలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 5000 మందికి పైగా అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. మహేశ్‌ అభిమానులతో రెండు గంటల సేపు ముచ్చటించారు. 

Mahesh-Family-2.jpg

మహేశ్‌ మాట్లాడుతూ ‘‘నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో అభిమానులు చూపించే ప్రేమ, అభిమానం గొప్పవి.  అందుకు నాన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన మీ గుండెల్లో, నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-11-27T18:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising