మేనల్లుడి పైశాచికం.. మామ నోట్లో గన్ పౌడర్ నింపి.. చివరకు అతడు చేసిన దారుణం..
ABN, First Publish Date - 2022-10-26T18:26:24+05:30
ప్రేమ విషయంలో కొందరు, డబ్బులు, ఆస్తుల విషయంలో మరికొందరు.. ఎంతటి దారుణాలకైనా తెగబడుతుంటారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు.. ఇలా బంధాలను మర్చిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు. తాము అనుకున్నదే జరగపోతే.. చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. గురుగ్రామ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మామపై పగ పెంచుకున్న మేనల్లుడు..
ప్రేమ విషయంలో కొందరు, డబ్బులు, ఆస్తుల విషయంలో మరికొందరు.. ఎంతటి దారుణాలకైనా తెగబడుతుంటారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు.. ఇలా బంధాలను మర్చిపోయి మరీ ప్రవర్తిస్తుంటారు. తాము అనుకున్నదే జరగపోతే.. చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. గురుగ్రామ్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మామపై పగ పెంచుకున్న మేనల్లుడు.. మామ నోట్లో గన్ పౌడర్ పెట్టి మరీ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పోలీసులు, బాధితులు, స్థానికుల కథనం మేరకు.. ఢిల్లీ (Delhi) పరిధి గురుగ్రామ్‌కు చెందిన విజేందర్‌కు జితేంద్ర అనే మేనల్లుడు ఉన్నాడు. అయితే వీరి మధ్య కొన్ని నెలలుగా ఆస్తులకు సంబంధించిన విషయంలో గొడవలు (Property disputes) జరుగుతున్నాయి. ఇటీవల ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో మామపై జితేంద్ర కోపం పెంచుకున్నాడు. విజేందర్ అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8గంటల సమయంలో జితేంద్ర పొలం పనుల్లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న జితేంద్ర.. అన స్నేహితులైన అశోక్, ధర్మేంద్రతో కలిసి అక్కడికి వెళ్లాడు. విజేందర్‌తో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు.
దీంతో మామ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ముగ్గురూ కలిసి విజేందర్‌పై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా నోట్లో పైపును పెట్టి, దాని నిండా గన్ పౌడర్ నింపారు. అనంతరం ఒక్కసారిగా దాన్ని పేల్చడంతో కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విజేందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడు మేనల్లుడు జితేంద్ర, అతడి స్నేహితుడి అశోక్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..
Updated Date - 2022-10-26T18:29:44+05:30 IST